📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu news : Revenue system : రెవెన్యూ వ్యవస్థలో పర్యవేక్షణ అవసరం

Author Icon By Sudha
Updated: October 15, 2025 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుత కాలంలో మన సమాజంలో ఎదురవుతున్న సమ స్యలలో ఒకటి రెవెన్యూ వ్యవస్థలో నెలకొన్న అవ్యవస్థలు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం రెవెన్యూ కార్యా లయాల ( Revenue system)చుట్టూ తిరుగుతూ నిస్సహాయ స్థితిలో పడుతు న్నారు. ప్రభుత్వం పౌరుల సేవ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాలు కొంతమంది బలవంతులు ఆధీనంలోకి వెళ్లి నట్లు అనిపిస్తోంది. సత్యం చెప్పాలంటే, ప్రజలకు సహా యం చేయాల్సిన కొందరు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గ్రామాల్లో భూములపై హక్కుల నిర్ధారణ, వారసత్వ హక్కులు, సర్వే వివ రాలు వంటి ప్రాథమిక సేవలు సకాలంలో అందుబాటులో ఉండాలి. కానీ, వాస్తవంలో ఇది చాలా అరుదుగా జరుగు తోంది. ప్రజలు దరఖాస్తులు వేసినా నెలల తరబడి సమా ధానాలు రాకపోవడం సాధారణ విషయంగా మారింది. కొన్నిసార్లు ఫైళ్లను కావాలనే ఆపివేయడం కూడా జరుగు తోందన్న అనుమానం ప్రజల్లో ఉంది. గ్రామస్థాయిలో భూ సమస్యలు చిన్న చిన్న అపార్థాల వల్ల పెద్ద సమస్యలుగా మారిపోతున్నాయి. ఈ సమస్యలను పరిషగరించాల్సిన రెవెన్యూ వ్యవస్థ (Revenue system)లోని సిబ్బంది తగిన సమయానికి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. దాంతో సమస్యలు పెరిగి కోర్టుల దాకా వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది. సాధారణ ప్రజలకు ఇది చాలా భారంగా మారుతోంది. రీ సర్వే పనులు చేపట్టినప్పటి నుండి చాలా చోట్ల భూముల సరిహద్దులు తప్పుగా నమోదు చేయబడటం, పాత రికార్డులతో కొత్త వివరాలు సరిపోలకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమ వుతున్నాయి.

Revenue system : రెవెన్యూ వ్యవస్థలో పర్యవేక్షణ అవసరం

ఆలస్యంఒక పెద్ద సమస్య

ప్రజలు తమ పూర్వీకుల నుండి వస్తున్న భూములకు కూడా హక్కులు నిర్ధారించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. భూములపై హక్కుల నిర్ధారణలో కొంత మంది బలవంతులు ఆధిపత్యంచెలాయిస్తున్నారు. నిజమైన హక్కుదారుల కంటే బలమైన సంబంధాలు కలిగిన వారు తమ ఆధీనంలో పత్రాలు మలుచుకుని,అసలు హక్కుదారు లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రజల్లో న్యాయం మీద నమ్మకాన్ని తగ్గిస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా పలు అవ్యవస్థలు చోటు చేసుకుంటు న్నాయి. ఒక భూమి పై రెండు మూడు రకాల పత్రాలు తయారు అవుతున్న సంఘటనలు తరచూ వినిపిస్తున్నాయి. ఇది ప్రజల్లో భయాన్ని కలిగిస్తోంది. భూమి కొనుగోలు చేసిన తర్వాత కూడా తామే నిజమైన యజమానులమా కాదా అన్న అనుమానం వారికి మిగిలిపోతోంది. దరఖాస్తు ల పరిష్కారంలో ఆలస్యంఒక పెద్ద సమస్యగా ఉంది. ఒక సాధారణ సర్టిఫికెట్ పొందడానికి కూడా వారాల తరబడి తిరగాల్సిన పరిస్థితి. ఆన్లైన్ వ్యవస్థలు వచ్చినప్పటికీ వాటి ద్వారా పూర్తి పరిష్కారం లభించడం లేదు. సాంకేతిక లోపా లు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల సిబ్బంది తీరుతో ప్రజలు భయ పడి సరైన సమాచారం అడగకుండానే వెళ్లిపోతున్నారు.

Revenue system : రెవెన్యూ వ్యవస్థలో పర్యవేక్షణ అవసరం

పర్యవేక్షణ చేయకపోవడం

ప్రజాసేవకులు కావాల్సిన వారు బలవంతుల పక్షాన నిలబడి ప్రజలను వెనక్కి తగ్గేలా చేస్తున్నారనే భావన పెరుగుతోంది.సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం పర్యవేక్షణ లోపం. ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయకపోవడం వల్ల క్రింద స్థాయిలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఫిర్యాదులు చేసినా సరైన స్పందన లేకపోవడం కూడా ప్రజలలోనిరాశను పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో సాధారణ ప్రజలు న్యాయం కోసం మధ్యవర్తులు, రాజకీయ నాయకులు లేదా న్యాయవాదుల సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది సమయ పరంగా, ఆర్థికపరంగా భారంగా మారుతోంది. రెవెన్యూ వ్యవస్థ ( Revenue system)పై ప్రజలకు తిరిగి నమ్మకం కలిగించాలంటే కఠిన మైన చర్యలు అవసరం. ఫైళ్ల ఆలస్యం, తప్పురికార్డులు, బలవంతులు ఆధిపత్యం, సిబ్బంది నిర్లక్ష్యం వంటి అంశాల ను సీరియస్గా పరిగణించి తక్షణ పరిష్కారం చేయాలి. ప్రజలు హక్కుల కోసం అధికారులను వేడుకోవాల్సిన పరి స్థితి కాకుండా, వారు స్వయంగా సేవలు అందేలావ్యవస్థ మారాలి. పారదర్శకత, బాధ్యత, సమయపాలన వంటి విలువలను రెవెన్యూ వ్యవస్థలో అమలు చేయాలి.ప్రజల భూముల సమస్యలు పరిష్కారమైతే సమాజంలో శాంతి, న్యాయం నెలకొంటుంది. ఈ సమస్యలను వాయిదా వేస్తే సామాజిక అసమానతలు పెరుగుతాయి. అందుకే రెవెన్యూ వ్యవస్థలో తక్షణ సంస్కరణలు అవసరం. రెవెన్యూవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తే గ్రామీణ ప్రజల జీవన ప్రమాణా లు మెరుగుపడతాయి. లేకపోతే బలవంతులు మాత్రమే లాభపడే పరిస్థితి కొనసాగుతుంది. అందుకే ప్రభుత్వ యం త్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలి. ఈసమస్యలను ప్రతి పౌరుడు సీరియస్గా పరిగణించి, సమాజంలో న్యాయం నిలబెట్టే ప్రయత్నం చేయాలి. వ్యవస్థలోమార్పులు రావా లంటే ప్రజల అవగాహన కూడా అంతే ముఖ్యం.
-తరిగోపుల నారాయణస్వామి

భారతదేశంలో రెవెన్యూ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు?

రైత్వారీ వ్యవస్థ అనేది బ్రిటిష్ ఇండియాలో థామస్ మున్రో ప్రవేశపెట్టిన ఒక భూ రెవెన్యూ వ్యవస్థ, ఇది ప్రభుత్వానికి ఆదాయ సేకరణ కోసం సాగుదారుడితో (‘రైతు’) నేరుగా వ్యవహరించడానికి వీలు కల్పించింది మరియు రైతుకు సాగు కోసం కొత్త భూమిని వదులుకోవడానికి లేదా స్వాధీనం చేసుకోవడానికి స్వేచ్ఛను ఇచ్చింది.

రెవెన్యూ వ్యవస్థ అంటే ఏమిటి?

భూమి ఆదాయం అంటే యజమాని భూమిని కలిగి ఉండటానికి బదులుగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏదైనా మొత్తం . ఇది ప్రభుత్వానికి చెల్లించే పన్ను యొక్క ఒక రూపం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన భూమి ఆదాయం మొత్తాన్ని నిర్ణయించడానికి, భూమి యొక్క భాగాన్ని అంచనా వేయడం జరుగుతుంది, దీనిని భూమి పరిష్కారం అంటారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Government Revenue latest news Public Administration Revenue Monitoring revenue system Telugu News Transparency

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.