📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Cocoa beans: కోకో గింజలకూ ధరల విధానం అవసరం

Author Icon By Sudha
Updated: January 30, 2026 • 4:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో 75 వేల ఎకరాలలో కోకో సాగు ఉన్నది. ప్రధా నంగా కొబ్బరి, ఆయిల్ పామ్ అంతర పంటగా రైతులు కోకో సాగు చేస్తున్నారు. కొబ్బరి తోటలకు తెగుళ్లు ఆశించ డం, ఈసంవత్సరం మినహా గత అనేక సంవత్సరాలుగా కొబ్బరికి ధరలేకపోవడం ప్రధానంగా కొబ్బరి రైతులు సంక్షో భం ఎదుర్కోవడంవలన రైతులకు కోకోపంట మీదనే ఆధార పడ్డారు. కోకో అంతరపంట కాస్త ప్రధాన పంటగామారింది. ప్రపంచంలో 20 దేశాలలో కోకో పంట సాగు ఉంటే 20వ దేశంగా భారతదేశం ఉంది. మనదేశంలో కూడా కేరళ, కర్ణా టక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోనే కోకో పంట సాగు ఉంది. చాలాకాలంగా కోకో గింజలు ధరలు తక్కువగా ఉండటం వలన గతం కంటే కేరళలో సాగు విస్తీర్ణం తగ్గిం చుకుని సుగంధ ద్రవ్యాల పంటల వైపు రైతులు మరలారు. మన రాష్ట్రలో మాత్రం కోకో పంట విస్తీర్ణం రోజు రోజుకి పెరుగుతోంది. మనదేశ అవసరాలకు కావలసిన కోకో గింజ లు 20శాతం మాత్రమే దేశంలో ఉత్పత్తి జరుగుతున్నదని, 80శాతం కోకో గింజలు (Cocoa beans), కోకో పౌడర్, బట్టర్, ఇతర ఉత్ప త్తులను దిగుమతులు చేసుకుంటున్నాము. కోకో దిగుమతుల పై దిగుమతి సుంకాలు నామమాత్రంగా ఉండడం వలన విదేశీ కోకో ఉత్పత్తులను దిగుమతులు చేసుకుని దేశీయంగా రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ధరలను చెల్లించడంలేదు. ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కోకో రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. భారత్ యూరోప్ యూనియన్ మధ్య జరు గుతున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో భాగంగా చాక్లెట్ ఉత్పత్తులపై సుంకాలు పూర్తిగా ఎత్తివేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కోకో ఉత్పత్తులపై నామమాత్రపు దిగుమతి సుంకాలు ఉండడం వలన కంపెనీలు విదేశీ కోకో ఉత్పత్తుల ను చేసుకొని దేశీయంగా రైతులను నష్టపరుస్తున్నాయి. కోకో దిగుమతులపై దిగుమతి సుంకాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి పోయి జీరో శాతం దిగుమతి సుంకాలకు ఒప్పందాలు చేసుకోవడం వలన కోకో రైతులు మరింతగా నష్టపోయే పరిస్థితి దాపు రిస్తుంది. విదేశీ కోకో ఉత్పత్తుల దిగుమతులను నిలుపుదల చేయాల్సి ఉంది.

Read Also: SC: దివ్యాంగుల టాయిలెట్ల పై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు

Cocoa beans

పార్లమెంట్ ఎన్నికలకు ముందు పామా యిల్ పై దిగుమతి సుంకాలు ఎత్తి వేయడంతో దేశీయంగా పామాయిల్ రైతులు నష్టపోయారు. ఎన్నికల అనంతరం దిగుమతి సుంకాలు పెంచడంతో ఆయిల్ పామ్గె లల ధర పెరగడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. రైతులు ఎంతో కష్టపడి కోకో గింజలు (Cocoa beans)ఉత్పత్తి చేస్తుంటే వాటి కొనుగోలుకు, మార్కెటింగ్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను గాలికి వదిలేయడం అన్యాయం. 30 ఏళ్లకు పైగా నుండి రాష్ట్రంలో కోకో పంట సాగు అవుతుంటే ఇంతవరకు కోకో గింజలకు ధర నిర్ణయం పాలసీ లేకపోవడం మరీ దారుణం. రాష్ట్రంలో పామాయిల్ రైతులు ఆయిల్ పామ్ గెలలకు ధర నిర్ణయ సూత్రాన్ని సాధించుకున్నారు. ఆయిల్ పామ్ గెలలకు క్రషింగ్ ద్వారా వచ్చే ఆయిల్ ఎక్స్ ట్రాక్షన్ రేట్ (ఓఇఆర్) ఆధారంగా అంత ర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రూపొందించిన ఫార్ములా ప్రకారం ప్రతినెల ధర నిర్ణయం జరుగుతుంది. అదేవిధంగా కోకో గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ధ రను అనుసంధానిస్తూ ఫార్ములా రూపొందించాలని కోకో రైతాంగం కోరుతున్నారు. అందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపడతామని గత సంవత్సరం హామీ
ఇచ్చారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కోకోగింజల ధరల పాలసీ ప్రకటించలేదు. మరలా కంపెనీల ఇష్టారాజ్యంగా మారింది. కోకో గింజలకు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మోసం చేసిన ఫలితంగా గత ఏడాది రూ.500 కోట్లకు పైగా రాష్ట్ర కోకో రైతులు నష్టపోయారు. 2025 ఫిబ్రవరి నుండి మే వరకు నాలుగు నెలల పాటు సుదీర్ఘ పోరాటాన్ని రాష్ట్రంలో కోకో రైతులు సాగించారు. ఫలితంగా రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకొని రూ.50ప్రోత్సాహం అందించి కిలో కోకోగింజలకు రూ.500 ధర కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కోకో రైతులకు ప్రోత్సాహం పేరుతో రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రక టించింది. అయితే రైతుల నష్టపోయింది రూ.500 కోట్లు పైనే. ఈ సంవత్సరం జనవరి నుండి కోకో గింజల సీజన్ ప్రారంభమైంది. ప్రస్తుతం కిలో కోకో గింజలను కంపెనీలు రూ.350లకు కొనుగోలు ప్రారంభించి రైతుల ఆందోళనల తో రూ.400 లకు పెంచి కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో కోకో విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర కోకో పరిశోధనా ఏర్పాటు అత్యవసరం.
– కె. శ్రీనివాస్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

agriculture policy Breaking News cocoa beans cocoa pricing crop pricing farmer issues latest news Telgugu news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.