📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

NCP leaders : సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

Author Icon By Sudha
Updated: January 30, 2026 • 4:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకులు కలిశారు. విమాన ప్రమాదంలో మరణించిన డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ పోర్ట్‌ఫోలియోలపై చర్చించారు. ఆయన నిర్వహించిన మంత్రి పదవులపై తమ పార్టీకే హక్కు ఉన్నదని తెలిపారు. శుక్రవారం ఎన్సీపీ సీనియర్‌ నేతలు (NCP leader)ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, ఛగన్ భుజ్‌బల్ కలిసి సీఎం ఫడ్నవీస్ అధికార నివాసానికి వెళ్లారు. అజిత్‌ పవార్ నిర్వహించిన కీలకమైన ఆర్థిక, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖలతో సహా అన్ని మంత్రిత్వ శాఖలు ఎన్సీపీ కోటాలోనే కొనసాగాలని కోరారు. ఈ మేరకు ఒక లేఖను సమర్పించారు. కాగా, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశం తర్వాత ఎన్సీపీ (NCP leader)కీలక నేత ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడారు. మహాయుతి కూటమి ప్రభుత్వంలో తాము భాగస్వాములని తెలిపారు.

Read Also: http://TMC vs BJP: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: మమతకు ఆధిక్యమేనా?

NCP leader

అజిత్ పవార్ నిర్వహించిన పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేయడానికి సరైన నిర్ణయం తీసుకోవాలని ఫడ్నవీస్‌ను కోరినట్లు చెప్పారు. మరోవైపు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పార్టీతోపాటు ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నదని ప్రఫుల్ పటేల్ తెలిపారు. ‘దుఃఖం నుంచి కోలుకోవడానికి అజిత్‌ పవార్‌ కుటుంబానికి కొంత సమయం ఇవ్వాలి. మేం త్వరలోనే సునేత్ర పవార్, ఇతర కుటుంబ సభ్యులతో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తాం’ అని అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Devendra Fadnavis latest news Maharashtra politics NCP leaders ncp news Political Meeting Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.