విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ (Cancer) లక్షణాలున్న వారిని ప్రాథమిక
దశలోనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం వచ్చే అక్టోబరు నుంచి అసంక్రమిత వ్యాధుల (ఎన్సీడీ) 4.0 సర్వే పేరిట ఇంటింటా వివరాలు సేకరించనుంది. సర్వే తీరుపై ఈ నెల 21 నుంచి సెప్టెంబరు 20 వరకు 18 వేల మంది వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సహాయకులకు వైద్య ఆరోగ్య శాఖ శిక్షణ ఇవ్వనుంది. గతేడాది నవంబర్లో నిర్వహించిన ఎస్సీడీ 3.0 సర్వేలో రక్తపోటు, మధుమేహం, క్యాస్సర్ పీడితులను గుర్తించారు. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ లక్షణాలు (Cancer symptoms) ఉన్నవారిలో కొందరు వివరాలు చెప్పడానికి, పరీక్షలకు ఆసక్తి చూపలేదు. తద్వారా వాస్తవ పరిస్థితులు వెలుగులోకి రాలేదు. తాజా సర్వేలో కేవలం క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారిని మాత్రమే గుర్తించనున్నారు. సర్వే లక్ష్యాలపై జనంలో అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారంతో పాటు ప్రజాప్రతినిథులను కూడ భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎన్సీడీ 3.0 సర్వేలో ఆరోగ్యశాఖ 225 ప్రశ్నలు అడిగింది. ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం ఇబ్బందిగా మారింది. 4.0 సర్వేలో ప్రశ్నలను 28కి తగ్గించారు. 18 ఏళ్ళు పైబడిన 4.10 కోట్ల మంది నుంచి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబడతారు. పురుషుల్లో నోటి క్యాన్సర్ మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారి వివరాలు సేకరిస్తారు. ప్రాథమిక స్థాయిలో సర్వేలో ఓ అంచనాకు వచ్చి వైద్యల సమక్షంలో మరోసారి పరీక్షిస్తారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :