విజయవాడ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల(Naxalism) కదలికలు కలకలం రేపాయి. అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా కేంద్ర బలగాలు, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ కలిసి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. కానూరు కొత్త ఆటోనగర్‌లోని ఒక భవనాన్ని తాత్కాలిక స్థావరంగా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్న ఈ బృందాన్ని మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు.
Read Also: Bihar Result: బిహార్లో ఓటమి బాధ్యత తనదే ప్రశాంత్ కిశోర్
నిఘా వర్గాల(Naxalism) సమాచారం ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ గుంపు సుమారు పది రోజుల క్రితమే కూలీ పనుల పేరిట విజయవాడకు చేరుకుంది. ఆటోనగర్‌లో అద్దెకు తీసుకున్న భవనంలో వీరి అనుమానాస్పద కదలికలు గమనించిన పోలీసులు గుప్త సమాచారం సేకరించి, తెల్లవారుజామున ప్రాంతాన్ని ముట్టడి చేసి మెరుపుదాడి చేశారు.
అరెస్టయిన వారిలో 12 మంది మహిళలు, నలుగురు కీలక నాయకులు, అలాగే 11 మంది మిలీషియా సభ్యులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. విచారణలో మావోయిస్టులు నగర శివార్లలో నాలుగు ప్రాంతాల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలతో డంప్‌లు ఏర్పాటు చేసినట్లు ముఖ్య సమాచారం బయటపడింది. దీంతో బలగాలు ఆ ప్రాంతాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి.
అదే సమయంలో, వీరికి అద్దెకు భవనం ఇచ్చిన యజమాని గత నెలన్నరగా విదేశాల్లో ఉన్నట్లు తేలింది. దీంతో భవన వాచ్‌మేన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసు విచారణ కొనసాగిస్తున్నారు. సాధారణంగా గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోనే కదిలే మావోయిస్టులు ఇప్పుడు వ్యూహం మార్చి నగరంలో గుప్త స్థావరం ఏర్పరచుకోవడం భద్రతా వర్గాలను అప్రమత్తం చేసింది. నగరంలోనే కార్యకలాపాలను విస్తరించాలని వీరు ప్రణాళిక రూపొందించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన అనంతరం విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కఠినతరం చేశారు. అరెస్టయిన వారిని లోతుగా విచారించి నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: