శ్రీకాళహస్తి Women Empowerment : తిరుపతి జిల్లాలోని తిరుపతి కేంద్రంలో ఈ నెల 14, 15న జాతీయ స్థాయి ‘మహిళా సాధికారిత సదస్సు’ను నిర్వహించుటకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో వచ్చే అతిధులు పుణ్యక్షేత్రాల (Guests of shrines) దర్శనానికి వెళ్ళాలంటే పరిసరాల్లో పుణ్యక్షేత్రాల్లో పార్కింగ్ ఏర్పాట్లును అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మహిళా సాధికారిత సదస్సుకు భారతదేశంలోని సుమారు 250 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరౌతారని సమాచారం. ఇందుకు సంబంధించి తిరుపతిలోని రాహుల్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేయుటకు రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు.
శ్రీకాళహస్తి పార్కింగ్ ఏర్పాట్ల పరిశీలన
ఒక వేళ 15న ప్రజా ప్రతినిధులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి వస్తే అన్ని వాహనాలకు పార్కింగ్ పరిస్థితి ఏమిటన్నది ప్రభుత్వ ప్రతినిధి రాజ్‌కుమార్, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్‌రెడ్డితో కలసి సన్నిధి వీధి పరిసరాలను పరిశీలించారు. ఇక్కడ పార్కింగ్‌కు సంబంధించి ఆర్డీఓ భాను ప్రకాష్‌రెడ్డి, శ్రీకాళహస్తి తహసీల్దార్ జనార్థన్ రాజు, సూర్యప్రకాశ్‌రావు తదితరులు పరిశీలించారు.
సదస్సుకు ముఖ్య అతిథుల రాక
తిరుపతి పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన ‘జాతీయ మహిళా సాధికారిత సదస్సు’ ప్రారంభానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై సదస్సును ఉద్దేశించి రాష్ట్రం అమలు చేస్తున్న మహిళల సదుపాయాలు, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అందిస్తున్న పథకాలపై కూడా ముఖ్యమంత్రి వివరించనున్నారు. రాజ్యాంగ పరంగా మహిళలకు కల్పిస్తున్న అవకాశాలతో పాటు రాబోయే రోజులపై మహిళా ప్రతినిధులు అవగాహన పొందనున్నారు. ముగింపు సమావేశానికి రాష్ట్ర గవర్నర్ నజీర్ హాజరుకావచ్చునని భావిస్తున్నారు. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల శాసనసభల స్పీకర్లు, ప్రముఖులు కూడా రానున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
జాతీయ మహిళా సాధికారిత సదస్సు ఎప్పుడు జరుగుతుంది?
ఈ సదస్సు ఈ నెల 14, 15 తేదీల్లో తిరుపతిలో జరుగుతుంది.
ఈ సదస్సుకు ఎవరు హాజరవుతారు?
దేశవ్యాప్తంగా సుమారు 250 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి మరియు వివిధ రాష్ట్రాల శాసనసభల స్పీకర్లు హాజరవుతారు.
Read hindi news : hindi.vaartha.com
Read also :