AP మరియు తెలంగాణ న్యూస్ లైవ్ అప్‌డేట్స్: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్న బ్రేకింగ్ న్యూస్, (National News Live Updates) ముఖ్యమైన అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి. అలాగే దేశం, అంతర్జాతీయ వార్తలు కూడా ఇక్కడ ఉన్నాయి.
ఇండియా కూటమి రాబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికలకు జస్టిస్ (National News Live Updates) బి. సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నిర్ణయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో జరిగిన సమావేశంలో తీసుకున్నారు.
జస్టిస్ రెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, గోవా లోకాయుక్తగా పనిచేశారు. అలాగే 2007-2011 మధ్య సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉండి రాజ్యాంగం, నేర, మానవ హక్కుల కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చారు.
ఆయన రాజకీయాలకు అతీతంగా, అందరికీ అంగీకారమైన వ్యక్తి అని కూటమి భావిస్తోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన బీజేపీ ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో పోటీ పడనున్నారు. రేపు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఈ ఎన్నికలో పార్లమెంటు రెండు సభల 786 మంది సభ్యుల్లో, గెలవడానికి 394 ఓట్లు అవసరం.