News Telugu: Narendra Modi: సత్యసాయి శత జయంతి వేడుకలకు వస్తున్న ప్రముఖులు వీరే

Read Time:  1 min
Narendra Modi
Narendra Modi
FONT SIZE
GET APP

పుట్టపర్తి: సత్యసాయిబాబా (sathya saibaba) శతజయంతి వేడుకలకు వివిధ రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 19న దేశ ప్రధాని నరేంద్ర మోడీ, 20న కేంద్ర మంత్రి నితిన్ గట్కరి, 21న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఒడిశా గవర్నర్కం భంపాటి హరిబాబు, 22న రాష్ట్రపతి ద్రౌపది మురు, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొంటున్నారు. వీరితోపాటు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, యనమల రేవంత్ రెడ్డి, సిద్ధి రామయ్యలు హాజరుకానున్నారు. గ్లోబల్ కౌన్సిల్ పరిధిలోని 130 దేశాల నుండి పలువురు విదేశీ ప్రముఖులు రానున్నారు.

Narendra Modi

Narendra Modi: సత్యసాయి శత జయంతి వేడుకలకు వస్తున్న ప్రముఖులు వీరే

Read also: Ramya Rank: రమ్య ప్రతిభకు రాష్ట్రం గర్వం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సత్యసాయి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పుట్టపర్తికి రానున్న ప్రముఖులను దృష్టిలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలను చేపట్టారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలను సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మరియు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నవంబర్ 18న సత్యనారాయణ వ్రతం, సత్యసాయి బాబా నూతన వెండి రథోత్సవం నిర్వహించనున్నారు. 19న హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించనున్న మహిళా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు.

ప్రశాంతి నిలయంలో జోలోత్సవం

20 21న సత్యసాయి సేవా సంస్థల జాతీయ సదస్సు నిర్వహించబడుతుంది. 22న శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ యూనివర్సి టీ 455 స్నాతకోత్సవం జరగనుంది. 23న సత్యసాయి బాబా శతజయంతి వేడుకలను హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ రథోత్సవంతో వేడుకలు ప్రారంభించనున్నారు. ప్రశాంతి నిలయంలో జోలోత్సవం నిర్వహిస్తారు. సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 18 నుండి 23 వరకు దాదాపు 15 లక్షల మంది సత్యసాయి భక్తులు సత్యసాయిని దర్శించుకొనున్నారు. రానున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ప్రభుత్వం మరియు సెంట్రల్ ట్రస్ట్ అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు..

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.