📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

Narcotics: ఉపేక్షిస్తే ఉపద్రవమే!

Author Icon By Sudha
Updated: January 28, 2026 • 3:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాదకద్రవ్యాల వ్యసనం జాతి వినాశనానికి దారి తీస్తుందని, దాన్ని సమష్టిగా నిర్మూలించాల్సి న అవసరం ఉందని ఎంతో కాలంగా ప్రపంచ వ్యాప్తంగా దేశాధినేతలు పదేపదే చెప్తూనే ఉన్నారు. కానీ అంతకు రెట్టింపు స్థాయిలో ఈ మహమ్మారి యేడాదియేడాదికి విస్తరిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా ఈ వ్యసనం పదిహేను, పదహారేళ్ల పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని, నేరాల సంఖ్య అదుపు లేకుండా పెరిగిపోతున్నది. మాదకద్రవ్యాల (Narcotics)మత్తులో వారు ఏంచేస్తున్నారో వారికే తెలియని పరిస్థితుల్లో చేయరాని, చేయకూడని పనులకు పాల్పడుతూ అవి కప్పిపుచ్చుకునేందుకు హత్యలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. తాజాగా మొన్న నిజామాబాద్ జిల్లాలో ఒక కారులో గంజాయి తరలిస్తున్న ముఠాను అడ్డుకు నేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్యపై కిరాతకులు కారుతోనే దాడికి ప్రయత్నించారు. దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రాథమిక చికిత్స అందించి హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కిడ్నీలు దెబ్బతినడంతో ఒక కిడ్నీని పూర్తిగా తొలగించారు. మరొక కిడ్నీకి డయాలసిస్ చేస్తున్నారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు వైద్యబృందం శతవిధాలా ప్రయత్నం చేస్తున్నది. ఎక్సైజ్, ఆరోగ్యశాఖ మంత్రులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. గంజాయి అక్రమ రవాణా అడ్డుకునే క్రమంలోనే సౌమ్యపై దాడి జరగడం దురదృష్టకరమ న్నారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేదిలేదని స్పష్టం చేశారు. పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదే కాదు ఇటీవల కాలంలో మాదకద్రవ్యాల (Narcotics)రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో ఎందరో అధికారులపై దాడులు జరు గుతున్నాయి. మొన్న ఆ మధ్య నెల్లూరు జిల్లాలో మత్తు మందుల వ్యాపారమే కాక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ముఠాగుట్టును రట్టు చేయడమేకాక అడ్డు కునేందుకు ప్రయత్నిస్తున్నారనే నెపంతో సామాజిక కార్యకర్తను హత్య చేయించినట్లు ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని దర్యా ప్తు చేస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో ఒక చోట ప్రధానంగా గంజాయితోపాటు మత్తు మందులు పట్టుబడుతూనే ఉన్నాయి. గంజాయి సాగు ఊహించని రీతిలో పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నూ, విశాఖ ఏజెన్సీలోనూ ఇటు తెలంగాణ, ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు ఇటీవల కాలంలో బాగా విస్తరించినట్లు వార్తలు అందుతున్నాయి. గతంలో ఆంధ్ర, ఒడిశా, సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ గంజా’ తనిఖీ ల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఆవిషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ అక్రమ వ్యాపారులను ప్రోత్సహిస్తున్నది మీరంటే మీరని పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇదేకాదు విదేశాల నుండి భారీఎత్తున డ్రగ్స్ అటు ఆంధ్రప్రదేశ్కు, ఇటు తెలం గాణకు చేరుకుంటున్నట్లు పట్టుబడుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. గతంలో గుజరాత్లోని ముంద్రా పోర్టులో ఇరవైఒక్కవేల కోట్లరూపాయల విలువైన మూడు వేల కిలోల హెరాయిన్ పట్టుబడినప్పుడు విజయవాడ లింక్లు వెలుగులోకి వచ్చాయి. మత్తుమందు సరఫరా కోట్ల
డాలర్ల వ్యవహారంలో ఎక్కువ భాగం ఉగ్రవాదులకే చేరుతున్నదని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, ఉజ్బెకిస్థాన్తోపాటు మరికొన్ని ఆఫ్రికా దేశా లు ఇందులో విరివిగా పాల్గొంటున్నాయి. కశ్మీర్ ఉగ్రవాదు లకు, పంజాబ్ లోని మత్తుమందు సరఫరాదారులకు గట్టి సంబంధమే ఉన్నట్లు బయటప డింది. మత్తుముఠాలు సొంతంగా ఒక పెద్ద నెట్వర్క్ను ఏర్పాటుచేసుకున్నాయి. మారుమూల ప్రాంతాలకు రవాణా చేయగలిగిన రకరకాల మార్గాలను ఏర్పర్చుకుంటున్నారు. లాటిన్ అమెరికాలో తయారవుతున్న మత్తు మందులు నలుమూలాల విస్తరిం చడంతోపాటు రసాయనికాలు తయారు చేసే యాంఫిటా మైన్ టైప్ మైన్స్ ఎక్కడికక్కడ తయారవుతున్నాయి. భారతదేశంలో ఈ తరహా మత్తుమందులు పెద్దమొత్తంలో ఉత్పత్తి అవుతున్నాయి. అందుబాటులోకి వస్తున్న ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఈమత్తుమందు వ్యాపా రులు ఉపయోగించుకుంటున్నారు. బ్యాంకులు, ఇతర వ్యవస్థలతో సంబంధం లేకుండా సరాసరి ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు బదలీచేయించే ‘క్రిప్టోకరెన్సీ వాడకం సైతం పెరగడంతో లావాదేవీలకు అదుపులేకుం డాపోతున్నది. గతంలో మత్తుమందులు కొనేవారు తెలి సినా నమ్మకం ఉన్న వ్యాపారినే సంప్రదించేవారు. మత్తు మందులు తీసుకొని డబ్బులు చేతిలో పెట్టేవారు. ఆవ్యాపారి కూడా అత్యంత రహస్యంగా మూడోకంటికి తెలియకుండా మత్తు మందు తెప్పించి అప్పగించేవాడు. ఇది అత్యంత పకడ్బం దీగా జరుగుతున్నా నిఘా విభాగం అధికారులు కన్ను వేయడంతో ఎక్కడో ఒక దగ్గర దొరికిపోయేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇండియాలో మారుమూల ప్రాంతాల్లో కూర్చొని ఎక్కడో విదేశాల్లో ఉన్న మత్తుమందు వ్యాపారికి ఆర్డర్ ఇవ్వొచ్చు. రవాణా, చెల్లింపులు సులభం కావ డంతో విక్రయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి ప్రపంచమంతా విస్తరించిపోయింది. మాదక ద్రవ్యాలను నిరోధించే విషయంలో మాటలకే పరిమితం కాకూడదు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రప్రభుత్వా లు ఉమ్మడి కార్యాచరణ రూపొందించి అమలు చేయగలిగితే కొంతవరకైనా నియంత్రించవచ్చు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

Breaking News drug abuse Drug Awareness latest news Narcotics Public Safety substance abuse Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.