📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Naravaripalle: నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్

Author Icon By Tejaswini Y
Updated: January 14, 2026 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు, టీడీపీ కార్యకర్తలు

నారావారిపల్లె: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె(Naravaripalle)లోని నివాసంలో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. భోగి పండుగ వేళ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ను కలిసేందుకు చుట్టపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్.. వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: AP Govt: వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

భూమి, ఇళ్లు, అభ్యర్థుల వినతుల పరిష్కారం

వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. వారసత్వంగా తమకు సంక్రమించిన 1.83 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన పత్తి శివకుమార్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తిరుమలలో అంగప్రదక్షణ భక్తులకు ఆఫ్ లైన్ ద్వారా టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ విధానాన్ని రద్దు చేయాలని ‘తిరుమలలో అంగప్రదక్షణ భక్తబృందం’ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు.

Naravaripalle: Nara Lokesh’s 81st day Praja Darbar

చిత్తూరు జిల్లా నిండ్రమండలం, కచ్చరావేడు గ్రామంలో దళితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని బి.శ్రీనివాసులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. తిరుపతి, పరిసర ప్రాంతాల్లో 150 ఎస్టీ ఎరుకుల కుటుంబాలు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని, ఆయా కుటుంబాలకు ఒకే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని శ్రీ వేంకటేశ్వర ఎస్టీ ఎరుకల సంఘం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

ప్రజా సమస్యల కోసం లోకేష్ హాజరు

తిరుమల తిరుపతి దేవస్థానంలో సొసైటీ విధానంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆఫీసర్లకు ఇతర ఉద్యోగుల మాదిరిగానే వైద్య సదుపాయంతో పాటు శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో తొలగించిన 160 మంది కాంట్రాక్ట్ సూపర్ వైజర్లు, పార్ట్ టైం సూపర్ వైజర్లకు డీఈఎస్ విభాగంలో తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కాంట్రాక్ట్ సూపర్ వైజర్స్ అసోసియేషన్(ఏపీఈఎస్ సీఎస్ఏ) ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు.

వారసత్వంగా సంక్రమించిన తమ రెండెకరాల భూమిని ఆన్ లైన్ లో నమోదు చేసి హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బలిజపల్లికి చెందిన కె.పార్వతి విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Politics Chandra Giri Nara Lokesh Naravaripalle Public Darbar Tirupati News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.