📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Nara Lokesh: జగన్ విమర్శలకు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

Author Icon By Sudheer
Updated: July 9, 2025 • 1:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh), మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలకు బలమైన కౌంటర్ ఇచ్చారు. కడపలో స్థాపించిన YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని వివరించారు. 2020–21లో యూనివర్సిటీ ప్రారంభించినప్పటికీ, సొంత భవనాలు లేకుండా, ఫుల్ టైం ఫ్యాకల్టీ లేకుండా మూడు సంవత్సరాలు యూనివర్సిటీ నడిపారని విమర్శించారు. కన్సల్టెంట్లతో తరగతులు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో జగన్ ఆడుకున్నారన్నారు. COA అనుమతి లేకుండా మూడు బ్యాచ్‌లను నష్టపరిచారని తెలిపారు.

COA నోటీసులు, అనుమతుల పెండింగ్, కోర్టు స్టే

2024లో COA జులై 1, 2 తేదీలలో యూనివర్సిటీని తనిఖీ చేసి, కనీస సౌకర్యాలు లేవంటూ జులై 26న నోటీసులు ఇచ్చిన విషయాన్ని లోకేష్ వెల్లడించారు. అక్టోబర్ 10న మూడు బ్యాచులకు అనుమతి లేదని COA స్పష్టం చేసింది. నవంబర్ 20న యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తాత్కాలిక అధ్యాపకుల నియామకంపై నిర్ణయం తీసుకుంది. అయితే వైసీపీ హయాంలో ఇచ్చిన రెగ్యులర్ అధ్యాపకుల నియామక నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నష్టం కాకుండా తాత్కాలిక సిబ్బందిని నియమిస్తూ చర్యలు తీసుకుంటోందన్నారు.

జగన్ ఆరోపణలపై లోకేష్ కౌంటర్ – ADCET పరీక్షపై వివరణ

జగన్ వేసిన ఆరోపణలపై స్పందించిన లోకేష్, “మీరు చేసిన తప్పులకు మాకు శాపాలు పెట్టడం ఏంటీ?” అంటూ నిలదీశారు. వైసీపీ హయాంలో జరిగిన కోతలే ఈ సంవత్సరం ADCETపై ప్రభావం చూపాయని చెప్పారు. ప్రస్తుతం APSCHEకు లేఖలు రాసి ADCET కన్వీనర్‌ను నియమించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. విద్యార్థుల హక్కులను కాపాడేందుకు, శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. తాము గత ప్రభుత్వానికి బాధ్యతలు ఉన్నప్పటికీ, విద్యార్థులకు నష్టం కాకుండా అండగా ఉంటామని నారా లోకేష్ స్పష్టం చేశారు.

Read Also ; Gujarat : గుజరాత్‌లో కూలిన భారీ వంతెన.. ముగ్గురు మృతి!

Google News in Telugu Jagan lokesh counter Nara Lokesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.