📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Nara Lokesh – ఏపీ అభివృద్ది పై లండన్ లో నారా లోకేశ్ ఏమంటున్నారంటే?

Author Icon By Anusha
Updated: September 17, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార వాతావరణం కేవలం మాటల్లోనే కాకుండా, వాస్తవంలో కూడా వేగంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పేర్కొన్నారు. గత పదిహేనునెలల్లో రాష్ట్రానికి సుమారు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆహ్వానించగలగడం ఈ మార్పుకు నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపుతున్న దూరదృష్టి, స్పష్టమైన ప్రణాళికలు కీలకపాత్ర పోషిస్తున్నాయని లోకేశ్ వివరించారు.

లండన్‌లో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్–యూకే బిజినెస్‌ ఫోరం’ రోడ్‌షోలో పాల్గొన్న లోకేశ్, నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే ప్రతిష్టాత్మక ‘భాగస్వామ్య సదస్సు–2025’కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి కొత్త అవకాశాలు, తాజా టెక్నాలజీలు, విస్తృత పెట్టుబడులు లభిస్తాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

నవంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, మాకు సుస్థిరమైన, నిరూపితమైన నాయకత్వం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఆయన అనుభవం ఇప్పుడు నవ్యాంధ్ర (Navya Andhra) కు దిక్సూచిగా మారింది” అని తెలిపారు. రెండో అంశం వ్యాపార నిర్వహణలో వేగానికి ప్రాధాన్యత ఇవ్వడమని, దీనికి ఉదాహరణగా ఆర్సెలర్ మిట్టల్ సంస్థ విషయాన్ని ప్రస్తావించారు.

“భారత్‌లోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ (Steel plant) ను ఏపీలో ఏర్పాటు చేస్తున్న ఆర్సెలర్ మిట్టల్ సంస్థ, తమకు ఎదురైన మూడు సమస్యలను మా దృష్టికి తీసుకురాగా, కేవలం 12 గంటల్లోనే వాటిని పరిష్కరించాం. అందుకే వారు నవంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు” అని వివరించారు. మూడో అంశం, తమ ప్రభుత్వంలో యువ నాయకత్వం ఎక్కువగా ఉండటమని, మంత్రుల్లో 17 మంది కొత్తవారేనని, స్టార్టప్ ఆలోచనా విధానంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామని పేర్కొన్నారు.

Nara Lokesh

ఇంత సాహసోపేతమైన హామీ ఇవ్వలేదని

రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, దేశంలో మరే రాష్ట్రం ఇంత సాహసోపేతమైన హామీ ఇవ్వలేదని లోకేశ్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చబోయే కీలక ప్రాజెక్టుల గురించి వివరిస్తూ, “దక్షిణ ఆసియాలోనే తొలి 158 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ (quantum computer) జనవరిలో అమరావతికి రానుంది. ప్రధాని మోదీ క్వాంటమ్ మిషన్‌ను ముందుండి నడిపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో డేటా సిటీ ఏర్పాటుతో రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి. ముంబై కంటే రెట్టింపు సామర్థ్యంతో 1.5 గిగావాట్ల డేటా సెంటర్లు విశాఖకు రానున్నాయి” అని తెలిపారు. ఐటీ విప్లవాన్ని (IT revolution) భారత్ అందిపుచ్చుకున్నట్టే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) (AI) ద్వారా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దీనికోసం కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఏఐని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెడుతున్నామని,

ఇందులో భాగంగా కార్మిక సంస్కరణలు

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలున్న యువతను తయారుచేయడానికి అక్టోబర్‌లో ‘నైపుణ్యం’ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.పరిశ్రమల స్థాపనకు అడ్డంకిగా ఉన్న నిబంధనలను సరళీకృతం చేస్తున్నామని, ఇందులో భాగంగా కార్మిక సంస్కరణలు, ల్యాండ్ కన్వర్షన్, నాలా ట్యాక్స్ వంటి అంశాలపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnav) చేసిన సూచనలను కేవలం 45 రోజుల్లోనే అమలు చేశామని లోకేశ్ గుర్తుచేశారు.

రాష్ట్రంలో 5,000 ఎకరాల్లో స్పేస్ సిటీ నిర్మించబోతున్నామని, ఇందులో భాగంగా ‘స్కైరూట్’ సంస్థకు వారం రోజుల్లోనే 300 ఎకరాలు కేటాయించామని తెలిపారు. విజన్ – 2047 లక్ష్యాలను చేరుకోవడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.టెక్ మహీంద్రా (Tech Mahindra) యూరప్ బిజినెస్ హెడ్ హర్షుల్ అస్నానీ సంధానకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో యూకే డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, ఐసీఐసీఐ బ్యాంకు యూకే సీఈఓ రాఘవ్ సింఘాల్, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ అభిషిక్త్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు. వివిధ అంతర్జాతీయ కంపెనీలకు చెందిన 150 మంది సీఈఓలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ttd-invites-chandrababu-to-tirumala-brahmotsavam/andhra-pradesh/549098/

10 lakh crore investments Andhra Pradesh speed of doing business Breaking News Chandrababu Naidu visionary leadership latest news Nara Lokesh statement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.