📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Nara Lokesh: లోకేష్ పోస్ట్‌పై ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: July 20, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెదేపా, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అన్ని రంగాల్లో దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాల్లో ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు సాగుతోంది. రాష్ట్రానికి కీలకమైన పరిశ్రమలు, టెక్నాలజీ సంస్థలు రావడం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని భావిస్తూ ఈ దిశగా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విశేషమైన కృషి చేస్తున్నారు.సోషల్ మీడియాలో చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, తన ట్వీట్స్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ వ్యాపారవేత్తల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి, ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విస్తరణకు కావలసిన వాతావరణం, మౌలిక సదుపాయాలు, వర్క్‌ఫోర్స్ లభ్యత గురించి ఆయన చెబుతూ, టాప్ కంపెనీలకు ప్రతీ అంశాన్ని చేరవేస్తున్నారు.

మహీంద్రా ప్లాంట్‌

ఈ మధ్యలో నారా లోకేష్ చేసిన ఓ పోస్ట్ దేశవ్యాప్తంగా పెద్దగా హైలైట్ అయింది.ఒక్క పోస్ట్‌తో ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ఆనంద్ మహీంద్రాను ఒప్పించారు. అదేలా అంటే, తాజాగా మహింద్రా గ్రూపు తమ కంపెనీకి సంబంధించిన యాడ్‌ను తెలుగులో రూపొందించింది. మీ విధి, మీ చేతుల్లో అనే అంశంతో రూపొందించిన యాడ్‌పై నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. అంతేకాక మహీంద్రా వాహనాలకు ఏపీ పెద్ద మార్కెట్ అని ఇక్కడ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌లో మహీంద్రా ప్లాంట్‌ను ప్రారంభించాలని ఎక్స్ వేదికగా లోకేష్ కోరారు. ఏపీకి వస్తే, ఉన్న అవకాశాలను తెలియచేయడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు.లోకేష్ ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) వెంటనే స్పందించారు. ఈమేరకు ఆయన మరో పోస్ట్ చేశారు. ‘ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. సోలార్ ఎనర్జీ, మైక్రో ఇరిగేషన్, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై మా టీమ్ ఇప్పటికే చర్చలు జరుపుతోంది.

వీటి తయారీకి

ఏపీ ప్రయాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు గర్వంగా ఉంది’ అంటూ ఆనంద్ మహీంద్రా తెలుగులో రిప్లై ఇచ్చారు.ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆనంద్‌ మహీంద్రా ఆసక్తి చూపడంతో,నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్‌ వేదికగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మనం కలిసి పనిచేద్దాం. ఈవీ వాహనాలు, రక్షణ, ఏరోస్పేస్‌ (Aerospace) తయారీ రంగాల్లోకి మీ సంస్థను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే వాళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున రాయితీలు ఇవ్వనుంది. మీరు వీటి తయారీకి ఏపీని ఎంచుకుంటేసంతోషిస్తాం’ అని లోకేష్ పేర్కొన్నారు. ఇప్పుడు వీరిద్దిర మధ్య జరిగిన చిట్ చాట్ ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఒక్క పోస్ట్‌తో లోకేష్ ఆనంద్ మహీంద్రాను ఒప్పించడం గ్రేట్ అంటున్నారు. ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు జనాలు.

నారా లోకేష్ ఏ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు?

నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపద్ధర్మ సమాచార, టెక్నాలజీ, పరిశ్రమలు, పెట్టుబడులు, యువజన వ్యవహారాలు శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు.

నారా లోకేష్ విద్యార్హతలు ఏమిటి?

నారా లోకేష్ అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎమ్.బి.ఏ పూర్తి చేశారు. అతను టెక్నాలజీ, పాలసీ మేనేజ్‌మెంట్‌పై మంచి అవగాహన కలిగిన నాయకుడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Heavy Rain Alert: వచ్చే ఐదు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

anand mahindra Andhra Pradesh Investments Lokesh Mahindra tweet Mahindra in AP Nara Lokesh Startup AP TDP government development Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.