📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Telugu News: Nara Lokesh: భారత్ డేటా రాజధానిగా విశాఖ

Author Icon By Pooja
Updated: November 28, 2025 • 10:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ప్రపంచ దిగ్గజ సంస్థలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ కు వరుస కడుతున్నాయి. సీఎంవో వర్గాల సమాచారాన్ని అనుసరించి మూడు నాలుగేళ్లల విశాఖపట్నం డేటా సెంటర్ల హబ్ మారనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ డిజిటల్ కనెక్షన్స్ తో కలిసి జాయింట్ వెంచర్ 1,000 మెగావాట్ల డేటా సెంటర్ను విశాఖలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది. రూ.98 వేల కోట్లతో ఏఐ ఆధారిత డేటా సెంటర్ను 2030 నాటికి అందుబాటులోకి తేనుంది. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి ప్రతిపాదనపై చర్చించారు. డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూములు, ఇతర అంశాల గురించి తుది చర్చలు నిర్వహించారు.

Read Also: HYD Biryani: ప్రపంచ ఉత్తమ రైస్‌ డిష్‌ల జాబితాలో హైదరాబాదీ బిర్యానీ

Nara Lokesh: Visakhapatnam as the data capital of India

అనంతరం ప్రభుత్వంతో రిలయన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడులతో 1,000 మెగా వాట్ల ఏఐ డేటా సెంటర్(Nara Lokesh) ఏర్పాటుకు గూగుల్ ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ అయిన బ్రూక్ఫీల్డ్ సైతం రూ.1.10 లక్షల కోట్లతో విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పా టుకు ప్రభు త్వంతో భూమి నిర్వహించింది. విశాఖలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 400 ఎకరాల్లో డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది. గుజరాత్లోని జామ్ నగర్లో ఉన్న 1,000 మెగావాట్ల డేటా సెంటర్కు అనుబంధంగా ఇది పని చేయనుంది. మాడ్యులర్ సాంకేతికతల గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్, ఏఐ ప్రాసెసర్ల ద్వారా డేటా నిల్వ చేసేలా అత్యాధునిక సాంకేతికతతో వివిధ సంస్థల అవసరాలకు అనుగుణంగా వాటిని సంస్థ తీర్చిదిద్దనుంది. సబస్టేషన్లు, అవసరమైన విద్యుత్ ఫీడర్లతో భవిష్యత్తు దశాబ్ద ఆవిష్కరణలకు వీలుగా దీన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది.

ఆసియాలో అత్యంత శక్తిమంతమైన ఏఐ మోలిక సదుపాయాలున్న నెట్వర్క్స్లో ఒకటిగా రిలయన్స్ డేటా సెంటర్ ఉండబోతోందని అధికారులు తెలిపారు. విశాఖలో 6,000 మెగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. వాటిని 2030 నాటికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం వాటికి భావిస్తోంది. ఇప్పటికే గూగుల్, రిలయన్స్, బ్రూక్ఫల్డ్ కలిపి 3 వేల మెగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. మరో మూడు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వంతో(Nara Lokesh) సంప్రదింపులు జరువుతున్నాయి. అవసరమైన భూములు, ఇతర సదుపాయాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో వాటికీ అనుమతులు ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిలయన్స్ పెట్టుబడి సంతోషాన్ని కలిగిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh News data capital Google News in Telugu IT development Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.