Nara Lokesh : మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు లాంఛనంగా ఆవిష్కరించారు.
ఘనస్వాగతం పలికిన ప్రజలు
రేవేంద్రపాడు చేరుకున్న మంత్రి లోకేశ్‌కు స్థానిక ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది.
Read Also: IND vs NZ T20 World Cup Final : కష్టాల్లో కివీస్
ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు
విగ్రహావిష్కరణ అనంతరం అక్కడ ఉన్న ఎన్టీఆర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు లోకేశ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో ఆయన కాసేపు ముచ్చటించి వారితో కలిసి ఫోటోలు దిగారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాసరనేని జశ్వంత్, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశినేని శ్రీఅనిత తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, స్థానికులు తరలిరావడంతో రేవేంద్రపాడులో సందడి నెలకొంది.
Hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :