Nara Lokesh: దివ్యాంగులతో ఆత్మీయంగా మమేకమైన మంత్రి లోకేశ్

Read Time:  1 min
Nara Lokesh: దివ్యాంగులతో ఆత్మీయంగా మమేకమైన మంత్రి లోకేశ్
FONT SIZE
GET APP

Nara Lokesh: మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించారు. బస్ స్టేషన్ నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్ ప్రయాణించారు.

Read Also: AP Liquor Prices: ఏపీలో మద్యం ధరలు తగ్గనున్నాయా?

Nara Lokesh: దివ్యాంగులతో ఆత్మీయంగా మమేకమైన మంత్రి లోకేశ్
Nara Lokesh: Minister Lokesh, who is deeply connected with the disabled

ఉండవల్లిలో ఆత్మీయ విందు

అనంతరం ఉండవల్లి నివాసంలో ‘దివ్యాంగ శక్తి పథకం’ లబ్ధిదారులతో జరిగిన ఆత్మీయ విందు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులను ఆత్మీయంగా పలకరించిన మంత్రి లోకేశ్, తన పక్కన కూర్చొన్న శివనాగరాజు, సౌభాగ్య, ఖాశీంబి, అన్నపూర్ణమ్మలతో మమేకమై మాటామంతీ కలిపారు. వారితో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దివ్యాంగుల గౌరవం పెంచాలని, వారిలో పట్టుదల ఎక్కువ అని అన్నారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. వికలాంగుల ఆత్మగౌరవం ముఖ్యమని లోకేశ్ పేర్కొన్నారు. సమాజంలో కూడా మహిళలను కించపరిచే పదాలను అందరూ విడనాడాలని, ఇందుకోసం తాను పోరాడుతున్నానని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.