📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

News Telugu: Nara Lokesh: టాటాగ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తో మంత్రి లోకేష్ భేటీ

Author Icon By Rajitha
Updated: October 7, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ,: టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో భేటీ అయ్యారు. ఈ భేటీలో టాటా పవర్ రెన్యూవబుల్స్ సిఇఒ సంజయ్ కుమార్ బంగా, ఇండియా హోటల్స్ ఎండీ పునీత్ ఛత్వాల్, టాటా ఎలక్సి సిఇఒ మనోజ్ రాఘవన్, టాటా ఆటో కాంప్ సిఇఒ మనోజ్ కోల్హాత్కర్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సిఇఒ సుకరన్ సింగ్, టాటా ఎలక్ట్రానిక్స్ ఎండీ రణధీర్ ఠాకూర్, టాటా కెమికల్స్ ఎండీ ఆర్. ముకుందన్, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సిఇఒ వినాయక్ పాయ్, ఎస్ టి టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ సిఇఒ బిమల్ ఖండేల్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ Nara Lokesh మాట్లాడుతూ… విశాఖపట్నంలో రాష్ట్ర అగ్రనేతల సమక్షాన ఈ నెలలో నిర్వహించనున్న టిసిఎస్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు.

NSS Award: ఎన్ఎస్ఎస్ అవార్డులు అందుకున్న ఆంధ్రా యువకులు

Nara Lokesh

టాటా పవర్ రెన్యూవబుల్స్ ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా రూఫ్తాప్ సోలార్ అభివృద్ధి చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే మార్గాన్ని అన్వేషించాలని, రాష్ట్రంలో సెల్, మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ స్థాపనకు గల అవకాశాలను పరిశీలించాలని విజప్తి చేశారు. విశాఖపట్నంలో Visakhapatnam టాటా ఎల్బీ రీజనల్ ఆఫీస్/ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, తూర్పుతీరంలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్ వేర్ డిఫైండ్ వెహికిల్స్, అటానమస్ సిస్టమ్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ టెక్నాలజీస్, ఆధారిత మొబిలిటీ, మెడ్క్ ఇన్నోవేషన్ల వంటి రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించండి.

టాటా ఆటోకాంప్ ఆధ్వర్యాన శ్రీసిటీలో ఎలక్ట్రిక్ వాహన భాగాలు, అధునాతన కంపోజిట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు స్థాపించే అవకాశాలను అన్వేషించండి. ఇందుకు అవసరమైన భూమి, ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రభుత్వం అందిస్తుంది. పెట్టుబడి పరిమాణాన్ని ఆధారంగా తీసుకుని ఇవి, ఎలక్ట్రానిక్ భాగాల తయారీ విధానంలో ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది. శ్రీసిటీలో ఇంజనీరింగ్ (Engineering) సెంటర్ను ఏర్పాటు చేయడానికి అవకాశాలను పరిశీలించండి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ నేతృత్వాన ఆంధ్రప్రదేశ్లో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించిన ఉత్పత్తి యూనిట్ను స్థాపించడానికి అవకాశాలను అన్వేషించండి. రక్షణ, భద్రతా వ్యవస్థల రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటులో ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించండి. టాటా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యాన ఆంధ్రప్రదేశ్లో ఓసాట్ సదుపాయం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించండి. ఇందుకోసం అవసరమైన భూమిని కోరుకున్న ప్రదేశంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మాన్యుపాక్చరింగ్ పాలసీ కింద అందించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేష్ తెలిపారు.

టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌ను ఎవరు కలిశారు?
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌ను కలిశారు.

ప్ర: ఈ భేటీలో ఎవరు పాల్గొన్నారు?
టాటా పవర్ రెన్యూవబుల్స్ సిఇఒ సంజయ్ కుమార్ బంగా, ఇండియా హోటల్స్ ఎండీ పునీత్ ఛత్వాల్, టాటా ఎలక్ట్రానిక్స్ ఎండీ రణధీర్ ఠాకూర్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సిఇఒ సుకరన్ సింగ్ వంటి టాటా గ్రూప్ టాప్ అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

epaper: https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh ata Group investment meeting latest news Nara Lokesh Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.