News Telugu: Nara lokesh: పుట్టపర్తిలో 74వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్‌

Read Time:  1 min
Minister Lokesh held the 74th day of Praja Darbar in Puttaparthi
Minister Lokesh held the 74th day of Praja Darbar in Puttaparthi
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పుట్టపర్తిలో (puttaparthi) 74వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సాధారణ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విచ్చేశారు. ప్రతి ఒక్కరినీ స్వాగతించి, వారి సమస్యలను శ్రద్ధగా విన్న లోకేశ్ వినతిపత్రాలు స్వీకరించారు.

Read also: Nara Lokesh: సత్యసాయికి చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళి..

Minister Lokesh held the 74th day of Praja Darbar in Puttaparthi

Minister Lokesh held the 74th day of Praja Darbar in Puttaparthi

ప్రతి ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని

ప్రజాదర్బార్‌లో పలువురు తమ గోడును మంత్రి ముందు వెల్లడించారు. గత ప్రభుత్వ కాలంలో అన్యాయంగా కేసులు పెట్టారని ముదిగుబ్బ మండలానికి చెందిన ఒక యువకుడు ఫిర్యాదు చేశాడు. తన ఇంటి స్థలాన్ని స్థానిక నాయకుల సహకారంతో కబ్జా చేశారని చెన్నేకొత్తపల్లికి చెందిన వ్యక్తి తెలిపాడు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న భవన నిర్మాణ కార్మికుడు సహాయం కోరగా, ఉద్యోగం కోసం చదువుకుమారిన యువతి కూడా తమ సమస్యను తెలియజేశారు.

ప్రతి ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని లోకేశ్ (Nara lokesh) ప్రజలకు హామీ ఇచ్చారు. ఎవరి సమస్య అయినా పరిష్కార మార్గం చూపేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని ఆయన తెలిపారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.