Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేశ్

Read Time:  1 min
Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేశ్
FONT SIZE
GET APP

Nara Lokesh: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. మంగళవారం నాడు మైలవరంలోని తారకరామా నగర్ మండల పరిషత్ పాఠశాలకు లోకేశ్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వెళ్లారు. “భోజనం ఎలా ఉంది? రోజూ ఇలాగే ఉంటుందా లేక ఈ ఒక్కరోజే బాగుందా?” అని విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ అడిగారు. భోజనం బాగుందని విద్యార్థులు చెప్పడంతో, వారితోపాటే కూర్చుని మంత్రి భోజనం చేశారు.

Read Also: A tragic wind : విషాద వీచిక!

Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేశ్
Nara Lokesh: Minister Lokesh Conducts Surprise Inspection of Government School

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

ఇటీవల ఇదే పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అప్పుడే స్పందించిన మంత్రి.. బాధ్యులైన హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, వంట ఏజెన్సీని కూడా తొలగించారు. భవిష్యత్తులో విద్యార్థుల భోజనం విషయంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. పాఠశాల స్థితిగతులపై ఎంఈవో, హెడ్‌మాస్టర్‌తో సమీక్ష నిర్వహించారు. అనంతరం, నారా లోకేశ్ సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.