📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Nara Lokesh: ‘సేవే సత్యమార్గం’ అని నారా లోకేశ్ సందేశం

Author Icon By Tejaswini Y
Updated: November 19, 2025 • 1:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రశాంతి నిలయం నిజమైన శాంతి, ఆధ్యాత్మికతకు నిలయమని ఏపీ విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) అన్నారు. పుట్టపర్తిని సందర్శించే ప్రతిసారీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తనను ప్రేమతో “బంగారూ” అని పిలిచిన భావన కలుగుతుందని తెలిపారు. ప్రేమ ఉంటే సాయిబాబా సాన్నిధ్యం ఎప్పటికీ మన మధ్య ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయంలో నిర్వహించిన మహోత్సవాలకు మంత్రి లోకేశ్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

Read also :  Gautam Gambhir: పిచ్‌ కీలకం కాదు.. ఆటగాళ్ల నైపుణ్యం ముఖ్యం: గంభీర్

Nara Lokesh message is Service is the path to truth

దైవత్వంతో నిండిన కృతజ్ఞతా సందర్భమని

బాబా శతజయంతి సాధారణ వేడుక కాదని, ఇది దైవత్వంతో నిండిన కృతజ్ఞతా సందర్భమని లోకేశ్ పేర్కొన్నారు. ప్రేమ, సేవ, మానవ విలువలతో నిండిన బాబా శతాబ్ది ప్రయాణం లక్షలాది మందికి మార్గదర్శకమైందని అన్నారు. ఈ పుణ్యోత్సవాలను నిర్వహించిన నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మహోత్సవాల్లో పాల్గొనడం తమకు గొప్ప భాగ్యమని చెప్పారు.

“భగవాన్ బోధించినట్లు, సేవే నిజమైన కులం, సమానత్వమే పరమమతం. ప్రార్థన కంటే సాయం చేసే చేతులు పవిత్రమైనవి. ‘అందరినీ ప్రేమించు – అందరికి సేవచేయి, ఎప్పుడూ సహాయం చేయి – ఎవరినీ బాధపెట్టకు’ అనే బాబా సందేశం శాశ్వతం. ‘నా జీవితం నా సందేశం’ అన్న బాబా జీవితమే మనకు మార్గదర్శక గ్రంథం” అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Aishwarya Rai Bachchan Chandrababu Naidu Nara Lokesh Narendra Modi event Pawan Kalyan Prasanthi Nilayam Putaparthi celebrations Sachin Tendulkar Sathya Sai Baba centenary Sathya Sai Jayanti

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.