📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

Nara Lokesh : మంగళగిరి దేశానికే ఆదర్శమా? లోకేశ్ పిలుపు!

Author Icon By Sai Kiran
Updated: January 26, 2026 • 6:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nara Lokesh : అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోవచ్చని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి Nara Lokesh అన్నారు. సోమవారం మంగళగిరి పట్టణంలోని ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించడంతో పాటు, చర్చి ప్రాంగణంలో మొక్క నాటారు.

అనంతరం జరిగిన సభలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, దేవుడు మనకు పరీక్షలు పెడతాడని, కానీ వాటిని జయించే శక్తిని కూడా ఆయనే ఇస్తాడని పేర్కొన్నారు. కష్టకాలంలో తోటివారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని చెప్పారు. ఏడాదిలోపే చర్చి నిర్మాణాన్ని పూర్తి చేసిన పునర్నిర్మాణ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని ఈ నిర్మాణమే నిదర్శనమని అన్నారు.

Read Also: Hyderabad: ఫర్నిచర్ దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం.. 5 మంది మృతి

Nara Lokesh

ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలకే యువత ఆందోళన (Nara Lokesh) చెందుతోందని ఆవేదన వ్యక్తం చేసిన లోకేశ్, పరీక్షల్లో విఫలమయ్యామని జీవితాన్ని ముగించుకోవడం బాధాకరమన్నారు. తన రాజకీయ జీవితాన్ని ఉదాహరణగా చెబుతూ, 2019లో మంగళగిరిలో ఎదురైన ఓటమిని ఒక పరీక్షగా తీసుకుని ముందుకు సాగానని గుర్తుచేశారు. కులమతాలకు అతీతంగా ఐక్యంగా పనిచేసి మంగళగిరి అభివృద్ధికి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh IT minister AP Political News Breaking News in Telugu community harmony development Google News in Telugu Latest News in Telugu Lutheran Church inauguration Mangalagiri Mangalagiri constituency news Mangalagiri Development Nara Lokesh Nara Lokesh comments Nara Lokesh Speech Telugu News unity for development AP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.