हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Nara Lokesh: విశాఖపట్నంలో ఐటీ కంపెనీల పండుగ! లోకేశ్ భూమిపూజ

Sushmitha
Telugu News: Nara Lokesh: విశాఖపట్నంలో ఐటీ కంపెనీల పండుగ! లోకేశ్ భూమిపూజ

విశాఖపట్నం: సీఐఐ భాగస్వామ్య సదస్సు కు ఒక రోజు ముందే, విశాఖపట్నంలో ఐటీ పండుగ వాతావరణం నెలకొంది. సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ గురువారం ఒకే రోజు 5 కంపెనీల ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.3,800 కోట్లు పెట్టుబడి రానుండగా, సుమారు 30 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. నగర ప్రజలు మంత్రి లోకేశ్‌కు నీరాజనాలు పలికారు.

Read Also: KA Paul: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కేఏ పాల్ ఆగ్రహం

Nara Lokesh
Nara Lokesh

ఐటీ హబ్‌కు క్యూ కట్టిన సంస్థలు

భారత్‌లో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) అయిన గూగుల్ ఏఐ హబ్(Google AI Hub) ప్రకటన తర్వాత విశాఖకు ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి. తాజాగా మంత్రి లోకేశ్ భూమిపూజ చేసిన ప్రాజెక్టులు ఇవే:

  1. సెయిల్స్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్: మధురవాడ ఐటీ హిల్ నెం.2లో రూ.21 కోట్లతో ఏఐ ఎక్సలెన్స్ సెంటర్‌కు శంకుస్థాపన. 430 మందికి ఉద్యోగాలు.
  2. ఐస్పేస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్: రూ.119.18 కోట్ల పెట్టుబడితో యూనిట్‌కు భూమిపూజ. 2,000 మందికి ఉద్యోగాలు.
  3. ఫీనోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్: మధురవాడ ఐటీ హిల్ నెం.2లో రూ.207.5 కోట్లతో గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు శంకుస్థాపన. 2,500 మందికి ఉద్యోగాలు.
  4. కె. రహేజా సంస్థ: మధురవాడ ఐటీ హిల్ నెం.3లో రూ.2,172 కోట్ల పెట్టుబడితో ఐటీ స్పేస్/మిక్స్‌డ్ డెవలప్‌మెంట్ స్పేస్‌కు శంకుస్థాపన. 15,000 మందికి ఉద్యోగాలు.
  5. కపిల్ గ్రూప్ (వరల్డ్ ట్రేడ్ సెంటర్): యండాడలో రూ.1,250 కోట్ల పెట్టుబడితో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ. 15,000 మందికి ఉద్యోగాలు.

పర్యాటకం, పెట్టుబడుల లక్ష్యాలు

సెయిల్స్ సాఫ్ట్‌వేర్ ఎండీ & సీఈవో కిరణ్ మాట్లాడుతూ, డిజిటల్ ఆంధ్రప్రదేశ్,(Andhra Pradesh) ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా తాము పనిచేస్తామని తెలిపారు. రహేజా సంస్థ ఐటీ స్పేస్‌తో పాటు రెసిడెన్షియల్ లగ్జరీ ఫ్లాట్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఐటీ/ఐటీఈఎస్ ఆఫీస్ స్పేస్, కమర్షియల్ స్పేస్‌లతో పాటు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో ఎంపీ ముతుకుమిల్లి శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870