📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nara Lokesh: జగన్‌కు క్రికెట్ టికెట్ కొనిస్తా.. నారా లోకేశ్ కౌంటర్

Author Icon By Saritha
Updated: February 23, 2026 • 5:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nara Lokesh: గతంలో తాను శ్రీలంకలో క్రికెట్ మ్యాచ్ వీక్షించడంపై వైఎస్ జగన్ (YS Jagan) చేసిన విమర్శలకు మంత్రి నారా లోకేశ్ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన, రాబోయే టీ20 ప్రపంచకప్‌ను ప్రస్తావించారు. టీమిండియా ఫైనల్‌కు వెళితే కచ్చితంగా స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తాను. కావాలంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి కూడా నా సొంత డబ్బులతో టికెట్ కొనిస్తాను అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాను గతంలో కూడా సొంత ఖర్చులతోనే మ్యాచ్‌లకు వెళ్లానని ఆయన స్పష్టం చేశారు.

హెరిటేజ్ సంస్థపై వస్తున్న విమర్శలను లోకేశ్ తీవ్రంగా తిప్పికొట్టారు. మార్కెట్‌లో నాణ్యమైన కిలో నెయ్యి ధర రూ. 1,000 కంటే ఎక్కువగా ఉంటుందని, కేవలం రూ. 360కి ఎక్కడైనా నెయ్యి దొరుకుతుందంటే అది కచ్చితంగా కల్తీదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే హెరిటేజ్‌పై సెబీ కి ఫిర్యాదు చేయడం రాజకీయ కక్షసాధింపేనని మండిపడ్డారు. తమ కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్‌కు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి లబ్ధి కూడా కలగలేదని తేల్చిచెప్పారు.

Read Also: Chandrababu Naidu: అసెంబ్లీలో రేపు తిరుమల లడ్డూ అంశంపై చర్చ

Nara Lokesh: I will buy cricket tickets for Jagan.. Nara Lokesh counters

అసెంబ్లీలో వైసీపీ తీరుపై విమర్శలు

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ తన సొంత సంస్థలైన సాక్షి మీడియా, భారతి సిమెంట్స్‌కు రూ. 1,000 కోట్ల మేర అడ్డగోలుగా లబ్ధి చేకూర్చుకున్నారని లోకేశ్ ఆరోపించారు. ప్రభుత్వ ప్రకటనలు, ఇతర మార్గాల ద్వారా ప్రజా ధనాన్ని తన సంస్థలకు మళ్లించారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడి, ఇప్పుడు నీతులు మాట్లాడటం జగన్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు.

బడ్జెట్‌పై చర్చ జరగాలని డిమాండ్ చేయడంపై లోకేశ్ విస్మయం వ్యక్తం చేశారు. నిజంగా చర్చపై చిత్తశుద్ధి ఉంటే, నాలుగు రోజుల పాటు సభా కార్యక్రమాలను ఎందుకు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు. చర్చకు అవకాశం ఉన్నప్పుడు గందరగోళం సృష్టించి, ఇప్పుడు బయట పడి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Assembly Heritage Ghee Controversy Latest News in Telugu Nara Lokesh T20 World Cup Ticket Telugu News YS Jagan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.