📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Telugu news: Nara Lokesh: విద్య, ఐటీ అంశాలపై కేంద్రం తో చర్చలు..

Author Icon By Tejaswini Y
Updated: December 15, 2025 • 2:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తూ కేంద్ర ప్రభుత్వంతో కీలక చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని కలసి, విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (NSTI) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖకు NSTI గుడ్ న్యూస్..

విశాఖ జిల్లా పెదగంట్యాడ ప్రాంతంలో సుమారు 5 ఎకరాల భూమిని ఈ సంస్థ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించినట్లు లోకేశ్ వివరించారు. NSTI ఏర్పాటుతో అధ్యాపకుల శిక్షణ, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ మార్పు వంటి రంగాల్లో ఇది ప్రాంతీయ శిక్షణ కేంద్రంగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అంతేకాదు, రాష్ట్రంలో NCVET అర్హతలను విస్తృతంగా అమలు చేయడానికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

ఇంతకు ముందు పార్లమెంట్‌కు వచ్చిన నారా లోకేశ్‌(Nara Lokesh)కు పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో కూడా ఆయన భేటీ కానుండగా, విద్యా, ఐటీ శాఖలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఇతర ఎంపీలు కూడా పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Government AP Education Minister AP IT Minister Nara Lokesh NCVET NSTI Visakhapatnam TDP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.