రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడం, పెండింగ్‌లో ఉన్న కీలక అంశాలను పరిష్కరించడం లక్ష్యంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఢిల్లీ పర్యటన (Delhi tour) కు సిద్ధమవుతున్నారు. ఈరోజు రాత్రి ఆయన హస్తినకు బయలుదేరుతారు.

ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీలు
సోమవారం రోజున లోకేశ్ (Nara Lokesh) వరుసగా కేంద్రంలోని ఆరుగురు కీలక కేంద్ర మంత్రులను కలవనున్నారు. రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Minister Nitin Gadkari), వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలు, అలాగే పెండింగ్‌లో ఉన్న పనులపై చర్చించనున్నారు.
సెమీకండక్టర్ యూనిట్‌పై కృతజ్ఞతలు
ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌కు సెమీకండక్టర్ తయారీ యూనిట్ మంజూరు చేసినందుకు మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను కలసి నారా లోకేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలపనున్నారు. ఈ యూనిట్ రాష్ట్రంలో పరిశ్రమల రంగానికి కీలక మలుపు తిప్పనుందని ప్రభుత్వం భావిస్తోంది.
నిరంతర సంప్రదింపులు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో కేంద్రంతో సమన్వయం ఎంతో ముఖ్యం అవుతోంది. ఈ దిశగా మంత్రి లోకేశ్ తరచూ కేంద్ర మంత్రులతో సంప్రదింపులు కొనసాగిస్తూ, ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని ప్రాజెక్టులు సాధించే దిశగా కృషి చేస్తున్నారు.
read hindi news: hindi.vaartha.com
Read also: