నెల్లూరు: రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీశాఖమంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. నగరంలోని స్థానిక విఆర్ సి సెంటర్ ఆధునీకరించిన విఆర్పాఠశాల ప్రారంభోత్సవ (VR School Opening Ceremony) వేడుకల్లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలగావించి పాఠశాలను ప్రారంభించారు. తొలుత లోకేష్ ఆయన సహచర మంత్రులైన నారాయణ, ఫరూక్, ఎంపీ వేమిరెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్మేలతో కలిసి పాఠశాల భవనాలను, అక్కడ అందిస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.
నారా లోకేష్ మాట్లాడుతూ
హైడ్రోఫోనిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ప్లేగ్రౌండ్స్, తదితరాలను సందర్శంచి సిబ్బందితో మాట్లాడారు. ఆట స్థలంలో క్రికెట్, వాలీబాల్ ఆడి సరదాగా గడిపారు. అనంతరం ఆయన విద్యార్థుల తల్లిండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. 150ఏళ్ల చరిత్ర గలిగిన విఆర్సి పాఠశాల గత పాలకుల నిర్ల క్ష్యంతో మూత పడిందన్నారు. పట్టుదలకు మారు పేరుగా ఉన్న మంత్రి నారాయణ (Minister Narayana) కృషితో నేడు విఆర్సి ఎంతో అద్భుతంగా రూపు >>2 దిద్దుకోవటం జరిగిందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఈ పాఠశాలను తయారు చేసేందుకు కృషిచేసిన మంత్రి నారాయణ కుమార్తే షరణిని అభినందించారు. ప్రభుత్వ పాఠ శాలల ముందు అడ్మిషన్లు లేవు అనే బోర్డులు చూ స్తుంటే విద్యాశాఖమంత్రిగా తనకెంతో సంతృప్తి వచ్చిందని, రాష్ట్రంలో 9600 పాఠశాలలను ఏర్పా టుచేశామని, విలువలతో కూడిన విద్యా బోధన అవసరమని గ్రహించి చాగంటి వారి రచ నలను పాఠపుస్తకాల్లో పొందుపరచటం జరిగిం దన్నారు. ఉపముఖ్యమంత్రి పదేపదే చెప్పినట్లుగా విద్యార్థులకు మొక్కల ఆవశ్యకత తెలిసేలా చెయ్యాలన్నారు. చదువుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమౌతుందని, విద్యార్థులు చెడు వ్యవనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.
ఏడాదికి రెండు సార్లు మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్స్
అలాగే వివిధ రకాల వ్యాపారాల్లో, రంగాల్లో అభివృద్ధి చెందిన వారు పి4లో భాగమై రాష్ట్రంలోని పాఠ శాలల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. విద్యాశాఖలో మార్పులు తీసుకువచ్చి విద్యార్థుల్లో మార్పులు తీసుకురావాలనే ఈ విద్యాశాఖను తాను స్వీకరించటం జరిగిందని తెలిపారు. విద్యార్థులు చదువు, ఆటలు పాటలు తదితర వివరాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించేందుకు ఏడాదికి రెండు సార్లు మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్స్ (Teachers Meeting) ను నిర్వహించటం జరుగుతుం దన్నారు. అలాగే తమకు విద్యాబుద్ధులు నేర్పించమని కమిషనరు కోరిన పిల్లలను దత్తత తీసుకుని తాను ప్రత్యేక చొరవతో చదివిస్తామని హామీ ఇచ్చారు. విఆర్సి తోపాటూ సంసృ్కత పాఠశాలను దత్తత తీసుకున్న డిఎస్ఆర్, ఆర్ఎస్ఆర్ను దత్తత తీసుకున్న ఎంపీ వేమిరెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి నారాయణ మాట్లాడుతు గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని, విద్యావ్యవస్థను పూర్తిగా బ్రష్టు పట్టించిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు నిదర్శనమే విఆర్సి పాఠశాల అని తెలిపారు.
ఎన్నికల హామీల్లో భాగంగా మూసివేసిన విఆర్సిని ఆధునీకరించి ప్రారంభించటం జరిగిందన్నారు. పి4లో భాగంగా ఎన్సిసి అధినేత రాజు, తమ కుమార్తే షరణిలు ముందుకు వచ్చి ఆదునీకరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో నగరంలోని 94వేల ఇళ్లలో 84వేల్ల ఇల్లు తిరిగి పేదల కష్టాలను స్వయంగా పరిశీలిం చామని, వీరికి మంచి చేయ్యాలనే విఆర్ను పునఃప్రారంభింపచేశామన్నారు. తానుకూడా ఇదే పాఠశా లలో 6 నుండి డిగ్రీ వరకు చదివానని, అనంతరం ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించామన్నారు. సుమారు 6800మంది ఇక్కడ చదువుకునే వారిని వారి సృతులను గుర్తుచేసుకున్నారు. ఈ పాఠశాల పునఃప్రారంభంగురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖమంత్రి లోకేష్లకు (Nara Lokesh) చెప్పగానే అను మతులు మంజూరుచేయటం జరిగిందన్నారు. అందరూ పి4లో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.
మంత్రి ఫరూక్ మాట్లాడుతు
ఇన్చార్జ్ మంత్రి ఫరూక్ మాట్లాడుతు పేదలకు సేవ చేయ్యాలని మంత్రి నారాయణ విఆర్ను పునఃప్రారంబించటం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే మెగా డిఎస్పీని నిర్వహించి 16వేల పోస్టు లను భర్తీచేసేందుకు మంత్రి లోకేష్ చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. మంత్రి ఆనం రామనా రాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విద్యావ్యవస్థలో మంత్రి లోకేష్ సమూల మార్పులు తీసుకువచ్చి నూతర ఒరవడికకు శ్రీకారం చుట్టారని, ఇదుకు నిరద్శనమే విఆర్ పాఠశాల ఆదునీకరణ అని తెలిపారు. విఆర్ మానేజ్మెంట్లో 45 సంవత్సరాలుగా ఉంటూ విద్యార్థుల అభివృద్ధికి కృషిచేశా మన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిమాట్లాడుతు విద్యాశాఖ మంత్రిగా లోకేష్కు అన్నీ విషయాల్లో లోతైన అధ్యయనం, అవగాహ ఉందన్నారు. తాము కూడా దత్తత తీసుకున్ని ఆర్ ఎస్ఆర్ను సుంద రంగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కావ్యకృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాన్చక్రవర్తి, వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్కుమార్, సివిల్సప్లయిస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాబి రామిరెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
ఏపీ ఐటీ శాఖ మంత్రి ఎవరు?
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ .
నారా లోకేష్ సాధించిన విజయాలు?
అవార్డులు మరియు గుర్తింపు. తాగునీటి సరఫరా, పాలనలో పారదర్శకత మరియు తన పంచాయతీ రాజ్ పోర్ట్‌ఫోలియో కింద ఇతర కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినూత్నంగా ఉపయోగించినందుకు లోకేష్ 2018లో “స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్” అవార్డును గెలుచుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Tirupati: తిరుపతిలో కత్తులు,కర్రలతో సైకో వీరంగం : యాచకుడు మృతి