ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టినరోజున తిరుమలకు వెళ్లడం ఈ కుటుంబానికి ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా శనివారం మార్చి 21న దేవాన్ష్ జన్మదినం కావడంతో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకోనున్నారు. ఈ పర్యటనలో నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ మరియు బ్రాహ్మణి కూడా పాల్గొని స్వామివారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటారు.
Read also: 6 Tastes of Ugadi: తీపి, చేదు, పులుపు.. ఏ రుచి దేనికి సంకేతం?

TTD: Babu Makes Massive Donation on Devansh’s Birthday
అన్నప్రసాద ట్రస్ట్‌కు భారీ విరాళం
దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కింద నడిచే ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్‌కు రూ.44 లక్షల భారీ విరాళాన్ని అందజేసింది. ఈ విరాళం ద్వారా ఒకరోజు మొత్తం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. దర్శనం అనంతరం చంద్రబాబు కుటుంబం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లి స్వయంగా భక్తులకు భోజనం వడ్డిస్తారు. కేవలం విరాళం ఇవ్వడమే కాకుండా భక్తులకు సేవ చేయడం ద్వారా తమ కృతజ్ఞతను చాటుకోవడం వీరి సంప్రదాయంగా వస్తోంది.
తిరుమల అభివృద్ధిపై సమీక్ష
తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. సాధారణంగా ఎవరైనా భక్తులు తమ ప్రియమైన వారి పుట్టినరోజున ఒకరోజు అన్నదానానికి అయ్యే రూ.44 లక్షలను విరాళంగా ఇచ్చి తమ మొక్కులు తీర్చుకోవచ్చని టీటీడీ TTD వెల్లడించింది. గతంలో మంత్రి లోకేష్ పుట్టినరోజున కూడా భాష్యం రామకృష్ణ ఇలాగే విరాళం అందించారు. భక్తులు తమ స్తోమతను బట్టి ఎంతైనా విరాళం ఇచ్చే సదుపాయం ఉండటంతో చాలామంది ప్రముఖులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: