ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ తన ప్రతిభతో అంతర్జాతీయంగా భారతదేశానికి గర్వకారణంగా నిలిచాడు. చెస్ గేమ్ (Chess game)లో అత్యంత వేగంగా పజిల్స్‌ను పరిష్కరించి, ఆయన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025’లో స్థానం సంపాదించాడు.
చారిత్రాత్మక వెస్ట్‌మిన్‌స్టర్ హాల్ వేదికగా పురస్కారం
ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానోత్సవం లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, అంతర్జాతీయ క్రీడా విశ్లేషకులు హాజరయ్యారు.
175 చెస్ పజిల్స్‌కి వేగవంతమైన పరిష్కారం
దేవాన్ష్, అద్భుతమైన దూరదృష్టి, వేగం తో మొత్తం 175 చెస్ పజిల్స్‌ను అత్యల్ప సమయంలో పూర్తి చేసి, ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ ఘనతతో ఆయన చిన్న వయస్సులోనే ప్రపంచ వేదికపై గుర్తింపు పొందాడు.
చంద్రబాబునాయుడు అభినందన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (chadrababu naidu)ఈ సందర్భాన్ని మరింత విశేషంగా గుర్తు చేశారు.
“మా మనవడు దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు పొందడం గర్వకారణం. అతని పట్టుదల, గురువుల మార్గనిర్దేశనం వల్లే ఇది సాధ్యమైంది” అని ప్రశంసించారు.
దేవాన్ష్‌ను ‘శభాష్ ఛాంప్’ అంటూ అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: