📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Nano fertilizers: నానో ఎరువుల వినియోగానికి సబ్సిడీ ప్రతిపాదనలేదు

Author Icon By Ramya
Updated: July 23, 2025 • 10:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజ్యసభలో కేంద్రం స్పష్టం – వైసిపి ఎంపి మేడా రఘునాథరెడ్డి వెల్లడి

రాజంపేట : దేశంలో నానో ఎరువుల వాణిజ్య వినియోగాన్ని వేగ వంతం చేయ డానికి సబ్సి డీ ఇవ్వాలన్న ప్రతి పాదన ఏది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రోత్సాహక పథకం కూడా ఏది ఇప్పటివరకు పరిశీలనలేదని రాజ్యసభలో వైసీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి అడిగిన ప్రశ్నకు సమానంగా లిఖిత పూర్వకంగా పేర్కొంది. నానో ఎరువుల (Nano fertilizers) వాణిజ్య వినియోగాన్ని వేగవంతం చేయడానికి తీసుకున్న చర్యలు, ఎరువుల వినియోగాన్ని ప్రోత్స హించడానికి ప్రభుత్వం వాటి ఉత్పత్తికి సబ్సిడీ (Subsidy) ఇవ్వాలని భావిస్తుందా అని ఎంపీ ప్రశ్నించారు. నానో ఎరువుల వినియోగానికి తీసుకున్న చర్యల గురించి ప్రస్తావించారు. అందుకు మంగళవారం కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి స్మాత్ అనుప్రియ పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నాను ఇరువుల వినియోగానికి అవగాహన శిబిరాలు, వెబ్నార్లు, నుక్కడ్ నాటకాలు, క్షేత్ర ప్రదర్శనలు, కిసాన్ సమ్మేళన్లు, ప్రాంతీయ భాషలలో చలనచిత్రాలు వంటి వివిధ కార్యకలాపాల ద్వారా నానో ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

Nano fertilizers: నానో ఎరువుల వినియోగానికి సబ్సిడీ ప్రతిపాదనలేదు

నానో ఎరువుల ఉత్పత్తి, సరఫరాలో వేగం

నానో ఎరువులను (Nano fertilizers) సంబంధిత కంపెనీలు ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలలో అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఎరువుల శాఖ క్రమం తప్పకుండా జారీ చేసే నెలవారీ సరఫరా ప్రణాళికలో నానో ఎరువులు చేర్చినట్లు వివరించారు. నానో యూరియా (Nano urea) వంటి నానో ఎరువులను ఆకులపై వేయడం ద్వారా సులభంగా ఉపయోగించడం కోసం ఖికిసాన్ డ్రోన్స్ వంటి వినూత్న స్ప్రేయింగ్ ఎంపికలు రిటైల్ పాయింట్ల వద్ద బ్యాటరీతో పనిచేసే స్ప్రేయర్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందుకు గ్రామ స్థాయి వ్యవస్థాపకుల ద్వారా పైలట్ శిక్షణ మరియు కస్టమ్ నియామక స్ప్రేయింగ్ సేవలను చురుకుగా ప్రోత్సహించడం జరుగుతుం దన్నారు. ఎరువుల కంపెనీలతో కలిసి డిఒఎఫ్ దేశంలోని 15 వ్యవసాయ వాతావరణ మండ లాల్లో సంప్రదింపులు, క్షేత్ర స్థాయి ప్రదర్శనల ద్వారా నానో డిఏపిని స్వీకరించడానికి మహా అభియాన్ ను ప్రారంభించిం దన్నారు. నానో ఎరువులకు ఎటువంటి సబ్సిడీని అందించడం లేదని పేర్కొన్నారు. అయితే, శాఖ తన ప్రభుత్వ రంగ సంస్థలను (శిళీగీలు) నానో ఎరువుల ఉత్పత్తి ప్లాంట్లను స్థాపించడానికి చురుకుగా ప్రోత్సహిస్తోందన్నారు. డ్రోన్లను ఉపయోగించి నానో ఎరువుల వాడకం ఖర్చుతో కూడుకున్న సాంకేతికతగా ఉద్భవించిందన్నారు. వ్యవ సాయం రైతు సంక్షేమ శాఖ, నమో డ్రోన్ దీదీ పథకాన్ని అమలు చేసిందన్నారు.

నానో ఎరువులు ఎవరు అభివృద్ధి చేశారు?

సాంప్రదాయ యూరియాను భర్తీ చేయడానికి మరియు దాని అవసరాన్ని 50% తగ్గించడానికి ఇండియన్ ఫార్మర్స్ అండ్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ (IFFCO) 2022లో నానో యూరియా ద్రవాన్ని అభివృద్ధి చేసింది. దీనిని అభివృద్ధి చేసినప్పటి నుండి ప్రభుత్వం నానో ఎరువుల వాడకాన్ని భారీగా ప్రోత్సహించింది.

నానో అగ్రికల్చర్ అంటే ఏమిటి?

నానోసెన్సర్లు అనేవి ఖచ్చితమైన వ్యవసాయంలో కొత్త పరికరాలు, ఇవి నేల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, వ్యాధికారకాలను గుర్తించడానికి, నీటిపారుదలని ఆప్టిమైజ్ చేయడానికి మరియు మొత్తం నేల మరియు మొక్కల పరిస్థితులను అంచనా వేయడానికి రూపొందించబడ్డాయి . పోషక స్థాయిలు, pH మరియు నేల కలుషితాలలో మార్పులను గుర్తించడం ద్వారా పర్యావరణ మార్పులకు ప్రతిస్పందించడానికి అవి నానోమెటీరియల్‌లను ఉపయోగిస్తాయి.

నానో ఎరువులు ఎలా తయారు చేయాలి?

నానో అమ్మోనియం ఫాస్ఫేట్ ఫాస్ఫర్ సమ్మేళన ఎరువుల తయారీ పద్ధతిలో ఈ క్రింది దశలు ఉంటాయి: ఫాస్ఫేట్ ధాతువును సల్ఫ్యూరిక్ ఆమ్లం లేదా నైట్రిక్ ఆమ్లంతో క్షీణింపజేసి ఫాస్పోరిక్ ఆమ్ల స్లర్రీని తయారు చేయడం; కార్బన్ కలిగిన సేంద్రీయ పదార్థాన్ని ఫాస్పోరిక్ ఆమ్ల స్లర్రీతో కలిపి నానో కార్బన్-ఫాస్పోరిక్ ఆమ్లాన్ని తయారు చేయడం..

Read hindi news: hindi.vaartha.com

Read also: Nandyal : నంద్యాల జిల్లాలో పొలానికి వెళ్లిన యువకుడిపై పెద్దపులి దాడి

Breaking News Kisan Drones latest news Nano DAP Nano Fertilizers nano urea No Subsidy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.