ఆంధ్రప్రదేశ్ లోని, నంద్యాల (Nandyala) జిల్లా శిరివెళ్లమెట్ట వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పగలడంతో రహదారికి అవతలివైపు ఎదురుగా వస్తున్న లారీ ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు డ్రైవర్లతో సహా లారీ క్లీనర్ మృతి చెందారు. అయితే ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, పరిశీలించారు.
Read Also: chandrababu naidu : దావోస్ టూర్ ముగిసింది, చంద్రబాబు వెంటనే ఏం చేయబోతున్నారు?
ఎన్‌హెచ్ఏఐ అధికారులపై ఆగ్రహం
ఎన్‌హెచ్ఏఐ అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఎఐ అధికారిని ఘటనా స్థలాన్ని చూపించి వరుస రోడ్డు ప్రమాదాలపై నిలదీశారు. ఇలాంటివి మరోసారి పునరావృతమైతే నిరసనకు దిగుతామని హెచ్చరించారు. జాతీయ రహదారి నిర్వహణ సరిగా లేదని అఖిల ప్రియ మండిపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: