Nandyal murder case: వివాహేతర మాయలో పడి… భర్తను హతమార్చి కాల్చేసింది!

Read Time:  1 min
Nandyal murder case: వివాహేతర మాయలో పడి… భర్తను హతమార్చి కాల్చేసింది!
FONT SIZE
GET APP

Nandyal murder case: పరాయి మగాడిపై మోజులో పడి ఏకంగా తాళి కట్టిన భర్తలను కడతేర్చుతున్నారు. నిన్న నూనెపల్లెలో నేడు గడిగరేవులలో.. నూనెపల్లె లో బండరాళ్లతో కొట్టి హత్య చేస్తే.. గడిగ రేవులలో శవన్నే కనిపించకుండా ఏకంగా కాల్చి బూడిద చేసిన సంఘటన హృదయాలను కలచివేసింది. వివరాలోకి వెల్లితే నంద్యాల జిల్లా గడివేముల మండలం గడిగరేవులలో ఆవుల శ్రీనివాసులు, భార్య వరలక్ష్మి నివాసముంటున్నారు. అయితే ఈ నెల 10వ తేదిన తన కుమారుడు కనిపించలేదని మృతుని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీనితో గడివేములు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.

Read Also : Bejjur police case: మహిళల అక్రమ రవాణా కేసు గుట్టురట్టు

Nandyal murder case: Falling into extramarital delusion... she killed and burned her husband!
Nandyal murder case: Falling into extramarital delusion… she killed and burned her husband!

అనంతరం విచారణ. చేపట్టారు. అయితే విచారణ చేపట్టిన పోలీసులకు అనుహ్యమైన నిజాలు బయటపడ్డాయి. గ్రామంలో వరుసకు మేనమామ అయిన వెంకటేశ్వర్లుతో వరలక్ష్మికి వివాహేతర సంబందం కొనసాగుతుందని, ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దీనితో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను తానే హత్య చేసి ఇంటి వెనుక బాగం లో కాల్చి వేశానని భార్య ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాణ్యం సీఐ. కిరణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు గడిగరేవుల గ్రామంలో వరలక్ష్మి, శ్రీనివాసులు భార్యాభర్తలు, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు.

అయితే శ్రీనివాసులకు మద్యం తాగే అలవాటు ఉందని చెప్పారు. దీనితో నిత్యం అనుమానంతో వేధిస్తున్నాడని ఎలాగైన అడ్డుతొలగించుకోవాలని ప్రియుడితో చర్చించి ఈనెల 10వ తేదిన తాగి ఇంటికి వచ్చిన భర్త శ్రీనివాసులను హత్య చేసింది. అనంతరం తన ప్రియుడు వెంకటేశ్వర్లుకు సమాచారం ఇచ్చి, అతని సహాయంతో ఇంటి వెనుక ఉన్న స్థలంలో యాసిడ్, పెట్రోలు పోసి మృతుడి ధరించిన బట్టలతో కల్పి బూడిద చేసిందని చెప్పారు. అయితే ఏమి తెలియనట్లు ఉండగా. మృతుడి సెల్ ఫోన్, అలాగే భార్య వరలక్ష్మి
సెల్ ఫోన్ సహాయంతో విచారణ చేపట్టామన్నారు. దీనితో నిజము ఒప్పుకోవడంతో భార్య, ఆమె ప్రియుడిని
అరెస్టు చేశామని చెప్పారు. తండ్రి బూడిద కాగా, తల్లి జైలు పాలు కావడముతో పిల్లలు అనాధలుగా మిగిలారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.