📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

Nandyal bus accident: హఠాత్తుగా బస్సులో మంటలు.. ముగ్గురు సజీవదహనం

Author Icon By Saritha
Updated: January 22, 2026 • 11:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులకు భయానికి ప్రయాణికులను గురిచేస్తున్నాయి. సురక్షితంగా గమ్యస్థానం చేరుతామనే గ్యారంటీ ప్రయాణికులకు లేకుండా పోయింది. ఇప్పుడు (Nandyal bus accident) తాజాగా నంద్యాల జిల్లాలో మరో ప్రైవేట్ బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

జిల్లాలోని శిరివెళ్లమిట్ట సమీపంలో కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఏఆర్ బీసీవీఆర్ ట్రావెల్స్ కు బస్సు ప్రమాదానికి గురైంది. శిరివెళ్లమిట్ట మీదుగా వెళ్తోన్నప్పుడు బస్సు టైర్ పేలిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పింది. కుడివైపు డివైడర్ దాటుకుని దూసుకెళ్లింది. ఎదురుగా వస్తోన్న ఓ కంటైనర్ ట్రక్ ను ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి.

Read Also: Anantapur Crime: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

పూర్తిగా కాలిపోయిన ప్రైవేటు బస్సు..

(Nandyal bus accident) ఘటనలో బస్సు డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఆయనను కడప జిల్లాకు(Kadapa District) చెందిన భాస్కర్ గా గుర్తించారు. బస్సు ఢీ కొట్టిన వేగానికి కంటైనర్ ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయింది. ట్రక్ డ్రైవర్, క్లీనర్‌ క్యాబిన్‌లోనే చిక్కుకుపోయారు. బయటకు రాలేక మంటల బారిన పడి, సజీవదహనం అయ్యారు. కంటైనర్ లో ఉన్న కొత్త బైక్స్ మంటల్లో కాలి బూడిద అయ్యాయి.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వారందరూ కూడా ప్రాణాలతో బయటపడగలిగారు. 14 మందికి కాలిన గాయాలయ్యాయి. వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు కిటికీ అద్దాలను పగులగొట్టుకుని ప్రయాణికులు బయటికి రాగలిగారు. క్లీనర్, ఈ మార్గంలో వెళ్తోన్న ఇతర వాహనదారులు వారికి సహాయం చేశారు. సమాచారం అందిన వెంటనే నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్, ఆళ్లగడ్డ డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh News Latest News in Telugu Nandyal bus accident private bus accident road accidents Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.