📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Naidupeta: ఇంటి దొంగతనాలను ఛేదించిన పోలీసులు..

Author Icon By Anusha
Updated: July 14, 2025 • 5:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంటి దొంగతనాలు కేసులను ఛేదించి, ముద్దాయిని అరెస్ట్ చేసిన నాయుడుపేట అర్బన్ పోలీసులు. ఇంటి దొంగతనం నేరాలనే వృత్తిగా ఎంచుకున్న ముద్దాయి.ఎవరికి అనుమానము రాకూడదనే ఉద్దేశముతో పార్వతీపురం జిల్లా (Parvathipuram District) గారుగువిల్లి గ్రామము నుండి వచ్చి దొంగతనాలు చేస్తున్న ముద్దాయి.సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముద్దాయి గుర్తించడం జరిగినది.దొంగతనం చేసి తన స్వగ్రామమునకు పారిపోతున్న ముద్దాయిని వారం రోజుల్లో వెంటాడి పట్టుకొవడం జరిగినది.52 సవర్ల (416 గ్రాములు) బంగారు నగలు, విలువ రూ 37,44,000/- చోరి సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగినది.అభినందించిన జిల్లా యస్.పి శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్ గారు.

కేసు వివరాలు:

  1. Cr.No.217/2025 u/s 331(3), 305 of BNS of Naidupeta UPS
  2. Cr.No.218/2025 u/s 331(3), 305 of BNS of Naidupeta UPS
  3. Cr.No.204/2025 u/s 331(3), 305 of BNS of Naidupeta UPS
  4. Cr.No.133/2025 u/s 331(3), 305 of BNS of Naidupeta UPS
  5. Cr.No.63/2025 u/s 331(3), 305 of BNS of Satyavedu PS

ముద్దాయి వివరాలు:

చందక మనికంఠ S/o సూర్యా రావు (Surya Rao) వయస్సు : 28 సం, పార్వతీపురం జిల్లా.

స్వాధీనము చేసుకున్న సొత్తు వివరములు:

52 సవర్ల (416 గ్రాములు) బంగారు నగలు, విలువ రూ 37,44,000/-
కేసు వివరములు.

తేది. 05.07.2025 న  ఉదయం 10.00 మరియు రాత్రి 8.45 గంటల మధ్య సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు నాయుడుపేట పట్టణములోని ముగాంబిక దేవాలయ వీధిలో నివాసం ఉంటున్న గంగినేని హరీంద్ర S/o నరసాప నాయుడు ఇంటిలో దొంగతనం చేసి సుమారు 52 సవర్ల (416 గ్రాములు) బంగారు నగలను దోచుకొని పోయినారని రాబడిన పిర్యాది  మేరకు నాయుడుపేట ఇన్స్పెక్టర్ గారు కేసును నమోదు పరచి దర్యాప్తు ప్రారంభించినారు.

       తిరుపతి జిల్లా యస్.పి. శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి  ఆదేశాల మేరకు నాయుడుపేట డి.యస్.పి. శ్రీ G. చెంచు బాబు గారి పర్యవేక్షణలో నాయుడుపేట పట్టణ CI శ్రీ M. బాబి గారు మరియు వారి సిబ్బంది తన స్వగ్రామమునకు పారిపోయిన ముద్దాయి చందక మణికంఠ ను వారం రోజులలో పట్టుకొని ఈ కేసులో పోయున దొంగ సొత్తు మొత్తంను స్వాధీనము చేసుకున్నారు..

     విచారణలో చందక మణికంఠ  ఈ సంవత్సరం నాయుడుపేట పట్టణములో తాను చేసిన 4 కన్నపు నేరము అంగీకరించగా అతని వద్ద నుండి చోరి సొత్తును స్వాధీనము చేసుకోనడమైనది.

గత నేర చరిత్ర

ముద్దాయి చందక మనికంఠ S/o సూర్యా రావు గతంలో తిరుపతి జిల్లా లోని తడ, శ్రీ సిటి, వరదయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలలో ఒక్కొక్క కేసు, విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోని మువ్వలవారి పాళెం పోలీస్ స్టేషన్ పరిధిలో 3, ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కన్నపు నేరాలు చేసివున్నాడు. ఇతనిపై మువ్వలవారి పాళెం పోలీస్ స్టేషన్ లో suspect sheet కూడా వున్నది.

నాయుడుపేట ఏమిటికి ప్రసిద్ధి?

నాయుడుపేట (Naidupeta), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్న ఒక ముఖ్యమైన పట్టణం. ఇది వాణిజ్య పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా పేరు పొందింది. నాయుడుపేట చుట్టుపక్కల కొన్ని అందమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి, ఇవి పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.

తిరుపతి నుండి నాయుడుపేట వరకు ఎంత దూరం ఉంది?

తిరుపతి నుండి నాయుడుపేట వరకు రహదారి మార్గంలో దూరం సుమారు 60 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రయాణానికి సగటున 1 గంట నుండి 1.5 గంటల సమయం పడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియామకంపై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

Breaking News gold theft case harsha vardhan raju IPS naidupeta crime news naidupeta police achievement parvathipuram burglar arrested telugu crime news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.