📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Latest News: Nagiri: మాజీ మంత్రి రోజాకు షాక్..నిండ్ర ఎంపీపీ దీప రాజానామా

Author Icon By Anusha
Updated: October 1, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిత్తూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి ఆర్.కే. రోజా స్వస్థలమైన నగరి (Nagari) నియోజకవర్గంలో అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామం వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. నగరి పరిధిలోని నిండ్ర మండల పరిషత్ అధ్యక్షురాలు (ఎంపీపీ) దీప తన పదవికి రాజీనామా చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

AP Weather: ఏపీకి వాతావరణశాఖ అలర్ట్..ఈ జిల్లాల్లో వర్షాలు

వ్యక్తిగత కారణాలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చిత్తూరులో జడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడిని కలిసి, తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆమె రాజీనామాను ఆమోదించిన తర్వాత, కొత్త ఎంపీపీని నియమిస్తారు.

ఉప ఎంపీపీ 1 లేదా ఉప ఎంపీపీ 2లో ఒకరిని ఎంపీపీగా నియమించే అవకాశం ఉంది.నిండ్ర ఎంపీపీ పదవిపై గతంలో రాజకీయంగా దుమారం రేపింది.. తాజాగా మళ్లీ రాజకీయ చర్చ మొదలైంది. ప్రస్తుత ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఆర్డీవోకు ఫిర్యాదు అందింది.

గతంలో పదవి దక్కని భాస్కర్‌రెడ్డి.

మాజీ శ్రీశైలం ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ చక్రపాణిరెడ్డి సోదరుడు భాస్కర్‌రెడ్డి ఈ ఫిర్యాదు ఇచ్చారు. వైస్ ఎంపీపీ దుర్గాదేవి, మరో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు ఆయనతో కలిసి వెళ్లారు. గతంలో పదవి దక్కని భాస్కర్‌రెడ్డి (Bhaskar Reddy) .. ఇప్పుడు టీడీపీలలో చేరి, మెజారిటీ సభ్యుల మద్దతుతో ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు.నాలుగేళ్ల క్రితం నగరి నియోజకవర్గం నిండ్ర ఎంపిక రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది.

అప్పుడు మాజీ మంత్రి రోజా వర్గానికి, చక్రపాణిరెడ్డి వర్గానికి మధ్య తీవ్ర వర్గ పోరు నడిచింది. అయితే వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం నిర్ణయంతో రోజా వర్గానికి చెందిన దీపకు ఎంపీపీ పదవి దక్కింది. అప్పుడు దీప వర్గానికి ఎంపీటీసీ సభ్యుల సంఖ్యాబలం తక్కువగా ఉన్నా, ఆమెకే పదవి ఇచ్చారు.

చక్రపాణిరెడ్డి సోదరుడు భాస్కర్‌రెడ్డికి పదవి దక్కకపోవడంతో

ఆ సమయంలో చక్రపాణిరెడ్డి సోదరుడు భాస్కర్‌రెడ్డికి పదవి దక్కకపోవడంతో నిరాశ చెందారు. వైఎస్సార్‌సీపీ వర్గ పోరు కారణంగా భాస్కర్‌రెడ్డి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఎంటీసీసీ సభ్యుల మద్దతు ఉంది..

 Nagiri

అందుకే, ఈసారి ఎంపీపీ (MPP) పదవి ఆయనకే దక్కుతుందని అంటున్నారు.వైఎస్సార్‌‌సీపీ ప్రభుత్వ హయాంలో నిండ్ర మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. ఏడు స్థానాలను వైఎస్సార్‌ గెలుచుకుంది. కేవలం కావనూరులో టీడీపీ గెలిచింది.

భాస్కర్ రెడ్డిని కాదని అప్పటి నగరి ఎమ్మెల్యే

అయితే నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత చక్రపాణిరెడ్డి సోదరుడు కొప్పేడు ఎంపీటీసీ భాస్కర్ రెడ్డికి ఎంపీపీ పదవి ఖాయం అన్నారు. ఆ తర్వాత కావనూరు ఎంపీటీసీ కూడా టీడీపీలో చేరడంతో ఎనిమిది స్థానాలు వైఎస్సార్‌సీపీకి దక్కాయి.

అయితే భాస్కర్ రెడ్డిని కాదని అప్పటి నగరి ఎమ్మెల్యే రోజా (Roja) ఎంపీటీసీ దీపకు పదవిని కట్టబెట్టారు. అప్పటి నుంచి చక్రపాణిరెడ్డి, భాస్కర్ రెడ్డి వర్గీయులు వైఎస్సార్‌సీపీకి దూరమయ్యారు.. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు.

ఈ క్రమంలో తాజాగా ఎంపీటీసీల సంతకాలతో దీపై అవిశ్వాస తీర్మానాన్ని ఆర్డీవోకు ఇచ్చారు. ఈ క్రమంలోనే దీప తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి రోజా స్వయంగా ఎంపీపీ పదవి కట్టబెట్టిన దీప రాజీనామా చేయడం ఎదురు దెబ్బ అనే చెప్పాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

#telugu News AP Political Updates Breaking News Chittoor politics Former Minister Roja latest news MPP resignation news Nagari politics Nindra MPP Deepa YSRCP leader resignation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.