📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’

Nageswaramma: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..

Author Icon By Tejaswini Y
Updated: December 24, 2025 • 5:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

JanaSena Party: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మంగళవారం మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామాన్ని సందర్శించారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్ల ప్రహరీలను కూల్చివేయగా, అప్పట్లో ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ గ్రామానికి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పి, మళ్లీ వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఇప్పటం గ్రామాని(Ippatam Village)కి వచ్చారు.

Read also: AP Biodiversity: శాసనసభా వ్యవస్థ ప్రచురించిన సీఎం చంద్రబాబు

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ(Nageswaramma) ఇంటిని సందర్శించారు. గతంలో రోడ్డు విస్తరణలో ఆమె ఇల్లు దెబ్బతినడంతో, ఆ తర్వాత ఆమె కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. అప్పట్లో ఆమె ఇంటికి వస్తానని పవన్ ఇచ్చిన హామీని నెరవేర్చడంతో ఈ భేటీ ఎంతో భావోద్వేగంగా మారింది. నాగేశ్వరమ్మ పవన్‌ను హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ సమయంలో నాగేశ్వరమ్మ “నువ్వు ఐదు సార్లు సీఎం కావాలి, అది నేను చూడాలి” అని పవన్ కళ్యాణ్‌ను ఆశీర్వదించారు. పవన్ కళ్యాణ్ ఆమెకు పాదాభివందనం చేసి గౌరవం తెలిపారు. అనంతరం నాగేశ్వరమ్మ(Nageswaramma)కు రూ.50 వేల ఆర్థిక సహాయం, ఆమె మనవడికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.

పవన్ కళ్యాణ్ గ్రామానికి వచ్చిన విషయం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. గత పరిస్థితులు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ జీవన పరిస్థితుల్లో వచ్చిన మార్పులను గ్రామస్తులు పవన్‌తో పంచుకున్నారు. ప్రజలు చెప్పిన విషయాలను పవన్ శ్రద్ధగా విని, వారి సమస్యలపై స్పందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Deputy CM Pawan Kalyan Indla Nageswaramma Ippatam Village JanaSena Party Mangalagiri Constituency Pawan Kalyan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.