Nadendla Manohar: వంటగ్యాస్ సమస్యలేదు.. మంత్రి నాదెండ్ల

Read Time:  1 min
Nadendla Manohar: వంటగ్యాస్ సమస్యలేదు.. మంత్రి నాదెండ్ల
FONT SIZE
GET APP

గృహావసరాల గ్యాస్ వాణిజ్య ప్రయోజనాలకు మళ్లిస్తే కఠిన చర్యలు

Nadendla Manohar: రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాపై ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ప్రజల్లో అపోహలు, ఆందోళనలు కలగకుండా చర్యలు తీసవాలని అధికారులను ఆదేశించారు. గృహా అవసరాల కోసం ఉద్దేశించిన వంట గ్యాస్ ఎక్కడా కొరత లేదని మంత్రి తెలిపారు. గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ఆయిల్ కంపెనీలు కూడా తెలియజేశాయని చెప్పారు.

Read Also : AP IAS Transfers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ

Nadendla Manohar: వంటగ్యాస్ సమస్యలేదు.. మంత్రి నాదెండ్ల
Nadendla Manohar: There is no problem with cooking gas.. Minister Nadendla

Nadendla Manohar: అపోహలు వద్దు.. గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయి.

అయితే గ్యాస్ ను పక్కదారి పట్టించడం, అక్రమంగా వాణిజ్య అవసరాలకు మళ్లించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా సూచించారు. జిల్లాల్లో గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద బుకింగ్స్, డెలివరీలు, పెండింగ్ అంశాలను నిరంతరం సమీక్షించాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అనుమానాస్పద లావాదేవీలు లేదా సరఫరాలో అక్రమాలు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. గ్యాస్ కొరతపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించిందన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నామని చెప్పారు. ఈ నెల 21న రావాల్సిన గ్యాస్ నౌక 25న చేరుతుందని కేంద్రం సమాచారం ఇచ్చిందని వెల్లడించారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా అవసరమైనంత మేరకే గ్యాస్ బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికంగా బుకింగ్స్ చేస్తే ఇతరులకు ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించారు. గ్యాస్ బుకింగ్స్ ఆన్లైన్ ద్వారానే చేయాలని, ఓటీపీ వచ్చిన తర్వాతే బుకింగ్ ఖరారవుతుందని తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.