📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Nadendla manohar: ధాన్యం బకాయిలు 659.39 కోట్లు జమ మంత్రి నాదెండ్ల

Author Icon By Ramya
Updated: July 11, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుంటూరు : రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఖరీఫ్, రబీ 2024-25 4575. 32కోట్ల విలువగల 19,84,098 మెట్రిక్ టన్నుల ధాన్యమును కొనుగోలు చేయటమైందని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రినాదెండ్ల మనోహర్ (Nadendla manohar) పేర్కొన్నారు. గురువారం సాయంత్రం తెనాలిలో మంత్రి క్యాంపు కార్యాలయంలో (Minister’s camp office) ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా ధాన్యము కొనుగోలు చేసిన 24గంటల నుంచి 48గంటలలోపే నగదు రైతుల యొక్క ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు బకాయిలనిమిత్తం ది.10-07-2025న రూ.659.39 కోట్లరూపాయలను (crores of rupees) 30,403 రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. దేశంలో మొదటిసారి 2024-2025 మొత్తము ఇప్పటివరకు 4575.32 కోట్ల రూపాయలను 2,01,934 రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు. 100 శాతం సొమ్మును రైతుల ఖాతాలలో జమ చేశామన్నారు. 2021-22 55 2,29,248 రైతుల నుంచి 26,23,535 కోట్ల రూపాయల విలువ గల 5,099.62 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడంజరిగిందని చెబుతూ, రబీ 2022-23 5 1,58,784, 2,884.04 కోట్ల రూపాయల విలువ గల 14,12,881 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. రబీ 2023-24 551,32,859, 2,763. 86 కోట్ల రూపాయలు విలువగల 12,64,845 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని మంత్రి వెల్లడించారు. ఖరీఫ్ సీజన్లో 2024-25: 5,65, 662, 35.94 మెట్రిక్ టన్నుల వరినిసేకరించారు, దీనివిలువ 5.8282. 27 . 24 48 గంటల్లోపు 5,65,662 మందిరైతులకు మొత్తం రూ.8282. 27 కోట్లు రూపాయలు చెల్లించడం జరిగింది. మొత్తం 24.31 లక్షల మెట్రిక్ టన్నుల బియ్య మును స్వీకరించడం జరిగిందని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు.

Nadendla manohar: ధాన్యం బకాయిలు 659.39 కోట్లు జమ మంత్రి నాదెండ్ల

రైతు పక్షాన నిజాయితీగా ప్రశ్నించే తత్వం ఉంటే.. చర్చకు రండి:

ఒక పార్టీ అధినేత చిల్లర మనస్తత్వంతో గతంలో మనిషిని తొక్కించారని, చిత్తూరు జిల్లా పర్యటనలో ఐదు ట్రాక్టర్లతో రెడీ చేసుకున్న పంటను దొంగ చాటుగా తీసుకువచ్చి రోడ్డుపై మామిడి కాయలు పోసి కేవలం ఫోటోలు కోసం వీడియోలు కోసం రైతు పండించిన పంటను ట్రాక్టర్లతో తొక్కేయడం దుర్మార్గం అన్నారు. రాజకీయాల్లో ప్రశ్నించే మనస్తత్వంఉంటే, రైతుపక్షాననిజాయితీగా ప్రశ్నించే తత్వం ఉంటే చర్చకురండి అని నాదెండ్ల మనోహర్ (Nadendla manohar) పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని హెచ్చరించారు.

నాదెండ్ల మనోహర్ బ్యాక్ గ్రౌండ్?

నాదెండ్ల మనోహర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ నుండి MBA గ్రాడ్యుయేట్, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని నిజాం కళాశాల నుండి మార్కెటింగ్ మరియు BA లో స్పెషలైజేషన్ పూర్తి చేశారు.

నాదెండ్ల మనోహర్ ఎవరు?

2024లో, ఆయన తెనాలి నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. ప్రస్తుతం, నాదెండ్ల మనోహర్ ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Shivraj Singh Chouhan: కరవు నివారణకు శాశ్వత చర్యలు

AndhraPradeshFarmers Breaking News CivilSuppliesDepartment Dhaanyam_Konugolu FarmerWelfare latest news NadendlaManohar Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.