విజయవాడ Farming : ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ (Andhra Pradesh Aquaculture) రంగంలో సాంకేతిక ఆధారిత రుణ సౌకర్యాలకు నాంది పలుకుతూ, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్. రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్). ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ)లు ఆక్వా ఎక్స్చేంజ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. సోమవారం విజయవాడలో జరిగిన ఈ ఒప్పందం కింద రొయ్యల సాగుదారులకు ఐఓటీ పరికరాల వినియోగంతో కూడిన ప్రత్యేక రుణ మోడల్ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాబార్డ్ ఉప మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ. కె. సూద్ హాజరయ్యారు. నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయచీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) ఎం.ఆర్. గోపాల్, ప్రధాన కార్యాలయ సీజీఎంలు మణికుమార్, డాక్టర్ ఏ.వి. భవానీ శంకర్, ఏపీజీబీ ఛైర్మన్ శ్రీ ప్రమోద్కుమార్ రెడ్డి, శ్రీమతి రేణు నాయర్, జనరల్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఅలాగే ఆక్వా ఎక్స్చేంజ్ సీఈఓ పవన్ కృష్ణ కొసరాజుపాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా రొయ్యల సాగుదారులను తక్కువ వడ్డీ రేట్లతో అధికారిక రుణ వ్యవస్థలోకి తీసుకువస్తూ, అనధికార రుణాలపై ఆధారాన్ని తగ్గించనున్నారు. ఐఓటీ పరికరాల వాడకంతో నీటి నాణ్యత, ఆహార వినియోగం, వ్యాధి నియంత్రణ వంటి అంశాలను తక్షణమే పర్యవేక్షించవచ్చు.
ఇది ఉత్పాదకతను పెంచి, ప్రమాదాలను తగ్గించి, సాంకేతిక ఆధారిత స్థిరమైన ఆక్వాకల్చర్క సహకరిస్తుంది. ఈ సందర్భంగా అధికారులు (Officials) మాట్లాడుతూ, భారత రొయ్యల ఎగుమతుల్లో కీలక స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ రంగ సామర్థ్యాన్ని మరింతగా విస్తరించేందుకు సాంకేతికతను, సంస్థాగత మద్దతును సమన్వయంతో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా స్థిరమైన ఆక్వాకల్చర్ ఫైనాన్సింగ్ నమూనాగా విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూ.1.25 కోట్లు విలువైన రుణ మంజూరు పత్రాలను ఐదుగురు రొయ్యల సాగుదారులకు అందజేయగా, ఐఓటీ పరికరాలను కూడా పంపిణీ చేశారు గ్రామీణాభివృద్ధికి తన అచంచల నిబద్ధతను ప్రతిబింబిస్తూ, నాబార్డ్ ఎలూరు జిల్లాలోని బుట్టాయగూడెం, పోలవరం మండలాల 10 గ్రామాల్లో గిరిజన అభివృద్ధి ప్రాజెక్టు కోసం 346.27 లక్షల గ్రాంట్ మంజూరు చేసింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :