📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Murder: తవణంపల్లె మాజీ వైస్ ఎంపిపి దారుణ హత్య కాళ్లు, చేతులు బంధించి ఉరివేసిన దుండగులు

Author Icon By Ramya
Updated: July 21, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తవణంపల్లె (చిత్తూరు) : మండల మాజీ వైస్ ఎంపీపీ, టీడీపీ నాయకుడు తెల్లగుండ్లపల్లె రంగయ్యనాయుడు శనివారం రాత్రి దారుణ హత్యకు (Murder) గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు రంగయ్యనాయుడు కాళ్ళు చేతులను తాళ్ళతో బంధించి ఇంటి ముందు వున్న ట్రాక్టర్ షెడ్డు వద్ద తాడుతో ఉరివేసి హత్య చేశారు. ఈసంఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో సంచలనం రేపింది. స్థానిక పోలీసుల కథనం మేరకు గత 15 సంవత్సరాల క్రితం మండల వైస్ ఎంపీపీగా పనిచేసిన తెల్లగుండ్లపల్లె రంగయ్యనాయుడు తెల్లగుండ్లపల్లెలో ప్రస్తుతం స్వగ్రామం భార్యతో కలసి నివాసముంటున్నారు. ఈనేపథ్య ంలో భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని కుమారుడు వద్దకు వెళ్ళింది. దీనితో కుమార్తె, అల్లుడు రంగయ్యనాయుడుకు తోడుగా ఇంటిలో వుంటున్నారు.

వివాదాలు లేని రంగయ్యనాయుడు హత్యపై అనుమానాలు, పోలీసుల దర్యాప్తు ముమ్మరం

శనివారం రాత్రి భోజనం అనంతరం కుమార్తె, అల్లుడుతో కలసి రంగయ్యనాయుడు ఇంటిలో నిద్రించారు. అయితే ఆదివారం వేకువజామున సుమారు 5.45 గంటలకు ఇంటి ముందు ట్రాక్టర్ షెడ్డు వద్ద హత్యకు గురై వేలాడుతుండడాన్ని పక్క ఇంటివారు గమనించి రంగయ్యనాయుడు కుటుంబసభ్యులకు తెలపగా గుర్తు తెలియని వ్యక్తులు హత్య (Murder) చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు చిత్తూరు డీఎస్పీ సాయినాధ్, రూరల్ వెస్ట్ సిఐ శ్రీధర్ నాయు డులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే చిత్తూరు నుండి పోలీసు జాగిలాలు, క్లూస్ టీం సంఘటనా స్థలంలో వేలిముద్రలను, ఆధారాలను సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ నాయుడు తెలిపారు. ఇదిలా వుండగా గ్రామంలో కొంత మంది యువకులతో జరిగిన చిన్నపాటి గొడవల వల్లే రంగయ్యనాయుడు హత్యకు గురై వుంటారనే కోణంలో పోలీసులు గ్రామానికి చెందిన కొంత మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారి స్తున్నట్లు తెలుస్తోంది. వివాద రహితుడు అయిన రంగయ్యనాయుడును ఎవరు? ఎందుకు హత్య చేశారనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Tamil Nadu: సాంబారులో విషం కలిపి భర్తను హతమార్చిన భార్య

Andhra Pradesh politics Breaking News Chittoor Crime latest news Rangaiah Naidu Death Suspicious Hanging TDP Leader Murder Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.