📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Murder: యజమానిని హతమార్చి డబ్బు ,నగలతో ఉడాయించిన పనిమనిషి ..ఎక్కడంటే?

Author Icon By Sharanya
Updated: July 11, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడలో ఓ హృదయవిదారకమైన హత్యా ఘటన జరిగింది. ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న ఓ వృద్ధుడు పని మనిషి చేతిలో దారుణంగా హతమయ్యాడు (Murder). ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే…

బొద్దులూరి వెంకట రామారావు (70) అనే వృద్ధుడు తన వృద్ధ తల్లి సరస్వతితో కలిసి విజయవాడ (Vijayawada) నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో నివసిస్తున్నారు. వృద్ధ తల్లిని చూసుకోవడానికి, ఇళ్ల పనులకు సహాయపడేందుకు రామారావు ఇటీవలే అనూష అనే మహిళను పనిమనిషిగా (woman is a maid) నియమించారు. అనూష కూడా అదే ఇంట్లో వారితో కలిసి నివసించేది. ఈ పరిచయం అత్యంత విషాదకర మలుపు తిప్పింది.

అర్ధరాత్రి ఘోర ఘటన

గత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రామారావు గదిలో లైట్లు వెలిగి ఉండటంతో అనుమానం వచ్చిన సరస్వతి వచ్చి చూడగా కుమారుడు అపస్మారక స్థితిలో మంచంపై పడి ఉండటంతో ఆందోళన చెందారు. మంచం మీద, రామారావుపై కారం చల్లి ఉండటాన్ని గమనించారు. పనిమనిషి అనూష కనిపించకపోవడం, బీరువా పగలగొట్టి ఉండటంతో పక్కింటి వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసుల స్పందన

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ ఉదయం ఆరు గంటల సమయంలో అనూషను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిందితురాలు తన భర్త సాయంతో రామారావు ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి చంపి (Murder) అనంతరం ఇంట్లోని బంగారు నగలు, నగదు తీసుకుని పరారయ్యారు. పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు .

హత్య అంటే ఏమిటి?

హత్య అంటే మరొక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా చంపడం . ఇది ఇంగ్లీష్ చట్టంలో అత్యంత తీవ్రమైన నేరం మరియు అందువల్ల తప్పనిసరి ‘జీవిత ఖైదు’ విధించబడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: TTD: తిరుమల లో15,16 రెండు రోజులు విఐపి బ్రేక్ రద్దు

Breaking News CrimeNews JusticeForRamaRao latest news MaidCrime money and jewelry Robbery Telugu News VijayawadaMurder

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.