📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Munneru River: రూ. 525.36 కోట్లతో మున్నేరుకు రిటైనింగ్ వాల్

Author Icon By Rajitha
Updated: September 25, 2025 • 11:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : ఖమ్మం నగర ప్రజల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంకై రూ 525.36 కోట్ల వ్యయంతో మున్నేరుకి Munneru River రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రజా ప్రభుత్వం చేపట్టింది. ఈ పనుల ప్రగతిని రెగ్యులర్గా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మానిరింగ్ చేస్తున్నారు. తెలంగాణలో Telangana విద్య, వైద్యం, వ్యవసాయ మార్కెటింగ్, వర్తక, వ్యాపార రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం అగ్రగామిగా నిలుస్తుంది. అయితే ఖమ్మం నగరం మద్య నుండి ప్రవహిస్తున్న మున్నేరు వాగు ప్రతి ఏటా వర్షాకాలంలో ఉదృతంగా పొంగి, పరిసర ప్రాంతాల ఇండ్లు, వర్తక, వ్యాపార సంస్థలు, పంటలు వరద ముంపుకి గురవుతున్నాయి. మారిన వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వస్తున్న ఆకస్మిక వర్షాలు, క్లౌడ్ బస్ట్ లతో ప్రభుత్వ మోళిక వసతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతున్నది.

పనులకు వెళ్ళిన వారు, ఇంటికి వచ్చి సామాన్లు, నిత్యావసరాలు సర్దుకునే వెసులుబాటు లభించదు. దీనితో వందలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయి, కట్టు బట్టలతో రోడ్డున పడుతున్నాయి. రోడ్లు , విద్యుత్ స్తంబాలు, సబ్ స్టేషన్లు, పాఠశాల భవనాలు, తాగునీటి వసతులు, పైపు లైన్లు, ఆరోగ్య కేంద్రాలు దెబ్బతింటున్నవి. రూరల్ మండలం లో పంటలు ముంపుకు గురవుతాయి. ఉదాహరణకు 2024 సెప్టెంబర్లో సంభవించిన క్లౌడ్ బస్ట్ తో మున్నేరుకు వచ్చిన ఆకస్మిక వరద ముంపుతో ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు రూ.757 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. మున్నేరు వాగు రివిట్మెంట్ వాల్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్నేరు వాగుకుMunneru River 5,863 కిలోమీటర్ల విస్తీర్ణం (క్యాచ్మెంట్ ఏరియా) నుండి గరిష్టంగా 10 వేల క్యుమెక్స్ వరద ప్రవహిస్తుంది. ఖమ్మం నగరం మధ్య నుండి ప్రవహిస్తున్న మున్నేరు వాగుకు ఎడమ వైపు డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా 379 క్యూమెక్స్ కుడి వైపు డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా 605 క్యూమెక్స్ వరద డిశ్చార్జ్ అవుతుంది.

Munneru River

పరివాహక ప్రాంతం, నగరం నుంచి వచ్చే వరద గరిష్ట స్థాయిని దృష్టిలో ఉంచుకుని, మున్నేరు. వాగు కు రెండు వైపుల సిమెంట్ కాంక్రీట్ రక్షణ గోడ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. మున్నేరు వాగు. వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రూ.525.36 కోట్ల వ్యయంతో మున్నేరు వాగుకు రెండు వైపుల రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులను 2024 మార్చి నెలలో ప్రారంభించారు. మున్నేరు వాగుకు రెండు వైపుల ఖమ్మం రూరల్ మండలంలో 8.5 కిలోమీటర్లు, ఖమ్మం అర్బన్ మండలంలో 8.5 కిలోమీటర్లు మొత్తం 17 కిలోమీటర్లు పొడవున 1015 మీటర్ల ఎత్తున రిటైనింగ్ వాల్ తో పాటు, సర్వీసు రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ సదుపాయంతో ప్రారంభించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల నాణ్యతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. వరంగల్ ఎన్ఐటి నిపుణులతో పనుల ప్రమాణాలను తనిఖీ చేయిస్తున్నది.రిటైనింగ్ వాల్ పనులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నారు.

ఖమ్మం అర్బన్ మండలం లో మల్లేమడుగు, దానవాయి గూడెం, బుర్హాన్ పురం, ఖమ్మం గ్రామాలు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి, గొల్లపాడు, గుడిమల్ల, గుర్రాలపాడు, ఏదులాపురం గ్రామాలకు చెందిన మొత్తం 245.12 ఎకరాల భూసేకరణలో 106.21 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. 138.31 ఎకరాల పట్టా భూమిలో ఇప్పటివరకు 69.12 ఎకరాలను సేకరించడం జరిగింది. భూ సేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. నిర్వాసితులకు పరిహారంతో పాటు, ఇండ్ల స్థలాలు కేటాయించుటకు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామంలో 139.27 ఎకరాల్లో లేఅవుట్ ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. ఈ లేఅవుట్ నందు 1,666 కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయించనున్నారు. అన్ని మోలిక వసతులతో మోడల్ కాలనీగా ఇది అభివృద్ధి చెందుతుంది. మున్నేరు రీటైనింగ్ వాల్ పనులు పూర్తయితే, ఖమ్మం పురోభివృద్ధికి మైలు రాయిగా నిలుస్తుంది. దశాబ్దాల సమస్యను పరిష్కరించిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రులు పేర్కొన్నారు.

మున్నేరు వాగు వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం ఏ పనులు చేపట్టింది?
రూ.525.36 కోట్ల వ్యయంతో 17 కిలోమీటర్ల పొడవున రెండు వైపులా సిమెంట్ కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టింది.

ఈ రిటైనింగ్ వాల్ పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
2024 మార్చి నెలలో ప్రారంభమయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News civil works flood control infrastructure development khammam flood prevention latest news munneru retaining wall Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.