📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Municipal elections: మున్సిపల్ గెలుపే రాజకీయ దిశానిర్దేశం!

Author Icon By Sudha
Updated: February 4, 2026 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల నేపథ్యం రాష్ట్ర రాజకీయాలను మరో కీలక మలుపు వద్ద నిలబె డుతోంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలుగా భావించే మున్సిపల్ ఎన్నికలు ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు, అలాగే బీజేపీకి రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పు అనంతరం తొలిసారిగా పట్టణ స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని కొలిచే అవకాశం రావడంతో ఈ ఎన్నికలు కేవలం మున్సిపాలిటీ పాలనకే పరిమితం కాకుండా, రాష్ట్రస్థాయి రాజకీయ బలాబలాలను నిర్ణయించే పరీక్షగా మారాయి. అందువల్లే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు (Municipal elections)ఇప్పుడు మినీ అసెంబ్లీ ఎన్నికలుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో మున్సిపల్ పాలనకు ప్రత్యేక చరిత్ర ఉంది. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పట్టణీకరణ వేగంగా పెరిగింది. హైదరాబాద్లో పాటు వరం గల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, రామగుండం వంటి పట్టణ కేంద్రాలు ఆర్థికంగా, జనాభా పరంగా విస్తరించాయి. 2011 జనగణన ప్రకారం తెలంగాణలో పట్టణ జనాభా సుమారు 38 శాతంగా ఉం డగా, తాజా అంచనాల ప్రకారం ఇది 42శాతానికి చేరువవుతోంది. అంటే రాష్ట్ర రాజకీయాల్లో పట్టణ ఓటర్ల పాత్ర రోజురోజుకీ పెరుగుతోంది. ఈ పట్టణ ఓటర్లే మున్సిపల్ ఎన్నికల ద్వారా తమ అసంతృప్తి లేదా మద్దతును నేరుగా వ్యక్తంచేసే స్థితిలో ఉన్నారు. గత దశాబ్దంలో తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలను పరిశీలిస్తే, అవి రాష్ట్ర రాజకీయాలకు సూచికలుగా ఎలా మారాయో స్పష్టంగా తెలు స్తుంది. 2019-20లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) మున్సిపల్ఎన్నికల్లో (Municipal elections)ఘన విజయం సాధించింది. 141 మున్సిపాలిటీల్లో 88కి పైగా చోట్ల బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగింది. ఆ ఫలితాలు తరువాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ రాజకీయ వేడిని పెంచాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు బీజేపీ ఎదుగుదలకు వేదికగా మారగా, బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకుంది. ఈ పరిణామాలన్నీ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ దిశను ఎలా ప్రభావితం చేస్తాయో అప్పుడే నిరూపించాయి.

Read Also : Tour: సెలవుల సందర్భంగా టీజీఎస్సార్టీసీ కొత్త పర్యాటక ప్యాకేజీలు

Municipal elections

రాజకీయాల్లో కీలక మార్పు

ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, పదేళ్ల బీఆర్ఎస్పాలనకు ముగింపు పలకడం తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పు. ఈ నేపథ్యంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి పెద్ద పట్టణ పరీక్షగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ప్రజల ముందుకు వెళ్లే ఈఎన్నికల్లో ప్రభుత్వ పనితీరు, ఇచ్చిన హామీల అమలు, పాలన శైలి నేరుగా ప్రజా తీర్పుకు లోనవుతుంది. అందుకే కాంగ్రెస్కు ఈఎన్నికలు – ప్రతిష్టాత్మకంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో మున్సిపల్ ఎన్నికలు రెండు విధాలుగా కీలకం. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పొందిన ప్రజాభిమానాన్నిపట్టణ స్థాయిలోనూ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో బలంగాఉన్న పట్టణస్థానిక సంస్థలపై తన పట్టుసాధించాల్సిన రాజకీయ అవసరం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 142 మున్సిపాలి టీలు, 12 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో అధిక భాగం ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభావంలోనే ఉన్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యల పరిష్కారంలో తన సామర్ధ్యాన్ని చూపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు పట్టణ ప్రజల్లో ఎంత మేరకు విశ్వాసం పొందాయన్నది కూడా ఈ ఎన్నికల్లో తేలనుంది. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా వంటి పథకాలు గ్రామీణ పాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపినప్పటికీ, పట్టణ ప్రాం తాల్లో నిరుద్యోగం, జీవన వ్యయం, ఇంధన ధరలు, అద్దె భారం వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఈ అంశాలపై ప్రజల స్పందన కాంగ్రెస్కు కీల కంగా మారనుంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు ఈ మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పునరుజ్జీవనానికి అవ కాశంగా మారాయి.

నిధుల కొరత

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ఎదుర్కొంటున్న అంతర్గత అసంతృప్తులు, నాయకుల వలసలు, కార్యకర్తల్లో నైరాశ్యం వంటి పరిస్థితుల్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్కు పరీక్షగా నిలుస్తున్నా యి. గతంలో పట్టణ ప్రాంతాల్లో బలమైన పట్టు ఉన్న పార్టీగా పేరున్న బీఆర్ఎస్, ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే తన రాజకీయ స్థితిని తిరిగి బలపరుచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఉత్తర తెలంగాణ పట్టణాల్లో బీఆర్ఎస్కు ఇప్పటికీ గణనీయ మైన ఓటు బ్యాంకు ఉందన్న అంచనాలు ఉన్నాయి. బీఆర్ ఎస్ వ్యూహం ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల చుట్టూ తిరగనుంది. అధికారంలోకి వచ్చి తక్కువ కాలంలో నే ఇచ్చిన హామీలు అమలు కాలేదని, అభివృద్ధి పనులు నిలిచి పోయాయని, ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని ఆరోపణలు చేస్తూ పట్టణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మున్సిపాలిటీలకు నిధుల కొరత, పారిశుద్ధ్య సమస్యలు, తాగునీటి ఇబ్బందులు వంటి అంశాలను ప్రధానంగా ప్రచారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్కు ఈ ఎన్నికలు తన రాజకీయ ప్రాధాన్యత ఇంకా తగ్గలేదని నిరూపించుకునే వేదికగా మారాయి. మూడవ ప్రధాన పార్టీ గా బీజేపీ కూడా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టా త్మకంగా తీసుకుంటోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గణనీయమైన విజయాలు సాధించిన బీజేపీ, పట్టణ ఓటర్లలో తన పట్టు పెంచుకోవాలనే లక్ష్యంతో ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి, యువత,వ్యాపార వర్గాల్లో తన ప్రభావాన్ని విస్తరించేందుకు మున్సిపల్ ఎన్నికలను ఉపయోగించుకో వాలని భావిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీని ఆన రాగా చేసుకుని కొన్ని పట్టణాల్లో కీలకపాత్ర పోషించాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా చర్చకువచ్చే అంశాలు పట్టణ జీవనానికి నేరుగా సంబంధించినవే. తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, చెత్తనిర్వహణ, రహదారుల పరిస్థితి, ట్రాఫిక్సమ స్యలు, అక్రమ నిర్మాణాలు, పట్టణ ప్రణాళిక లోపాలువంటి సమస్యలు ఓటర్లను ప్రభావితం చేస్తాయి. గత పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో కొన్ని పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగు పడ్డాయన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, అనేకచోట్ల అసమాన అభివృద్ధి జరిగిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యలను ఎంత వేగంగా పరిష్క రిస్తుందన్నది ప్రజల తీర్పులో కీలకంగా మారనుంది.

Municipal elections

పార్టీలకు పెద్ద సవాల్

గణాంకాల పరంగా చూస్తే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రాధా న్యత మరింత స్పష్టమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి సుమారు 3,500కు పైగా వార్డులు ఉన్నాయి. ఒక్కోవార్డులో సగటున 3,000 నుంచి 5,000వరకు ఓటర్లు ఉంటారు. అంటే దాదాపు కోటిమంది పట్టణ ఓటర్లు నేరుగా ఈఎన్నికల్లో పాల్గొంటారు. ఈస్థాయి ఓటర్ల అభిప్రాయం రాష్ట్రరాజకీయాలకు స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఈఎన్నికల ద్వారా వేలాది మంది ప్రజాప్రతినిధులు ఎంపిక అవుతారు. వీరిలో భవిష్యత్తులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఎదిగే నాయకులు ఉండే అవకాశం ఉంది. అందువల్ల అన్నిపార్టీలు ఈ ఎన్నికల ను నాయకత్వ తయారీ వేదికగాకూడా చూస్తున్నాయి. మున్సి పల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు పెద్ద సవాల్గా మారింది. తెలంగాణలో పట్టణ రాజకీయాల్లో వ్యక్తిగత పరి చయాలు, సామాజిక సమీకరణాలు, స్థానిక సమస్యలపై అవ గాహన కీలకంగా ఉంటాయి. పార్టీ ఇమేజ్ ఎంత బలంగా ఉన్నా, స్థానిక అభ్యర్థిపై అసంతృప్తి ఉంటే ఫలితాలు ప్రతి కూలంగా మారేఅవకాశం ఉంది. గత ఎన్నికల్లో అనేక చోట్ల పార్టీకంటే అభ్యర్థి వ్యక్తిగత ప్రభావమే గెలుపును నిర్ణయించి న సందర్భాలున్నాయి. అందువల్ల ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేకజాగ్రత్తలు తీసుకుం టున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కూడా కీలక సూచికగా మారనుంది. అయితే ఇటీవల పట్టణ ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరగడం, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ కావడంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయి. అధిక ఓటింగ్ ప్రభుత్వంపై అసంతృప్తిని సూచిస్తుందా లేక ప్రజల చైతన్యాన్ని ప్రతిబింబిస్తుందా అన్నది ఫలితాల అనంతరం విశ్లేషణకు అంశంగా మారనుంది.
-రామ కిష్టయ్య సంగన భట్ల

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Indian Politics latest news local body elections Municipal Elections political strategy Telugu News voter sentiment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.