📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Mudragada Padmanabham: వైసీపీ సీనియర్ నేత ముద్రగడకు తీవ్ర అస్వస్థత

Author Icon By Sharanya
Updated: July 20, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాపు ఉద్యమ నేత మరియు వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శారీరకంగా బలహీనపడిన ముద్రగడ (Mudragada) ను కుటుంబ సభ్యులు అత్యవసరంగా కాకినాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు.

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలింపు యత్నం

ఆరోగ్య పరిస్థితి విషమంగా (Health condition is critical) మారుతుండటంతో, మెరుగైన వైద్యసౌకర్యం కోసం ముద్రగడ (Mudragada Padmanabham) ను హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. స్వయంగా ముద్రగడ కూడా అదే సూచించారు. అయితే, స్థానిక వైద్యుల సూచన మేరకు ఆయనను తాత్కాలికంగా కాకినాడ మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది

కాకినాడ మెడికవర్ హాస్పిటల్‌లో ప్రస్తుతం ముద్రగడకు అత్యవసర వైద్యచికిత్స కొనసాగుతోంది. వైద్యుల ప్రకారం ఆయన ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉన్నప్పటికీ, చికిత్సకు స్పందన కనిపిస్తోందని చెప్పారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాస్పిటల్ వద్ద ఆందోళనతో వేచిచూస్తున్నారు.

కుమార్తె క్రాంతి పరామర్శ – కుటుంబంలో గందరగోళం

తండ్రి ఆరోగ్య సమాచారం తెలిసిన వెంటనే ముద్రగద కుమార్తె బార్లపూడి క్రాంతి హాస్పిటల్‌కు చేరుకుని పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. క్రాంతి రాకపై హాస్పిటల్ సిబ్బంది ఆమెను ముద్రగడ ఉన్న గదికి పంపించారు.

కుమారుడు గిరి అసహనం – కుటుంబ మధ్య విభేదాలు బయటకు

క్రాంతి హాస్పిటల్ గదికి వెళ్లడాన్ని ముద్రగడ కుమారుడు గిరి తీవ్రంగా అభ్యంతరపడ్డారు. తన అనుమతి లేకుండా ఎవ్వరినైనా ముద్రగడ దగ్గరకు పంపించరాదని హాస్పిటల్ సిబ్బందికి హెచ్చరించారు. గత కొంత కాలంగా తండ్రి–కూతురు మధ్య ఉన్న విభేదాలు తాజాగా మరోసారి బయటకు వచ్చాయి. ఇది కుటుంబంలో అంతర్గత సమస్యల్ని స్పష్టం చేస్తోంది .

Read hindi news: hindi.vaartha.com

Read also: Tirumala: తిరుమల క్యూలైన్‌లో గుండెపోటు తో భక్తుడు మృతి

Andhra politics Breaking News Kakinada news latest news Mudragada Daughter Kranti Mudragada health issue Mudragada Padmanabham Telugu News YCP Leader Health

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.