అనంతపురం : ఎంపి లాడ్స్ నిధులను (MP Lads funds) ప్రతి ఏటా ఒక్కొక్క ఎంపికి కేటాయించే రూ.5 కోట్లను కేంద్ర ప్రభుత్వం 10 కోట్లకు పెంచాలని అనంతపురం ఎంపి అంబికా లక్ష్మినారాయణ బుధవారం లోక్ సభలో కేంద్ర ప్రభుత్వానికి విజప్తి చేశారు. ఎంపి లాడ్స్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై జిఎస్టి మినహాయింపును కూడా ఇవ్వాలని ఆయన కేంద్రానికి విజప్తి చేశారు. పార్లమెంట్లో నిబంధన 377 కింద ఎంపి లాడ్స్ పథకంలో తక్షణ మార్పులు చేపట్టాలని బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో విజప్తి చేశారు. 2011 నుంచి ప్రతి ఎంపికి ఎంపి లాడ్స్ కింద ఏడాదికి 5 కోట్లు నిధులను కేటాయిస్తున్నారన్నారు. పెరిగిన ద్రవ్యోల్బనం, నిర్మాణ వ్యయాల పెరుగుదల, అవసరాలు ప్రజా పెరుగుదలతో నిధులు తక్కువ వస్తున్నాయని అనంతపురం లోక్ సభవంటి గ్రామీణ నియోజకవర్గాల్లో తాగునీటి కొరత, రహదారుల నిర్మాణం, ఇతర అభివృద్ధి పథకాలు చేపట్టేందుకు ప్రస్తుతం ప్రాథమిక అవసరాలకే ఎంపి లాడ్స్ నిధులు సరిపోవడం లేదని, అందులో భాగంగా రూ.5 కోట్ల నుంచి 10 కోట్లకు (10 crores) పెంచాల్సిన అవసరం ఉందని ఆయన విజప్తి చేశారు. అదే విధంగా ఎంపి లాడ్స్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై జిఎస్టి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాల మాదిరే ఎంపి జిఎస్టి లాడ్స్ పనులకు మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి చర్యల ద్వారా వెనుకబడిన రాయలసీమ లాంటి ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధి చర్యలకు గ్రామీణాభివృద్ధి చర్యలను విస్తృతంగా చేపట్టేందుకు కేంద్రం ఆదుకున్నట్లు అవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇతర మంత్రిత్వ శాఖలను ఎంపి అంబికా లక్ష్మినారాయణ ప్రత్యేకంగా విజప్తి చేశారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :