📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

mother tongue : ఆర్భాటాలే.. ఆచరణేది?

Author Icon By Sudha
Updated: January 2, 2026 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాతృభాషను సంరక్షించుకోవాల్సిన అవసరం, ఆవశ్యత గురించి పాలక పెద్దలు పదేపదేచెప్తుం టారు. అమ్మభాషలో ఉన్న ఆత్మీయత, ఆనందం మరెందులోనూ లభించదనేది తెలియని విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషలకు లిపి లేకపోవడంతో విద్యారూపం అందించే ప్రయత్నాలు చేయకపో వడం వల్ల కాలగర్భలో కలిసిపోయాయి. కలిసిపోతున్నాయి. దాదాపు రెండువేల సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన తెలుగు భాష పరిస్థితి అంత ఆశాజనకంగా కన్పించడం లేదు. ఒకనాడు సంస్కృతి, ప్రాకృతం, అరబిక్, పార్శ్సీ, ఉర్దూ, పోర్చుగీసు, ఇంగ్లీషుతోసహా అనేక భాషల ప్రభావం తట్టుకొని నిలబడగలిగిన తెలు గుకు ప్రస్తుతం ఆశించిన మేరకు చేతల్లో ఆదరణ లభించడం లేదేమోన నిపిస్తున్నది. మాతృభాష (mother tongue) అయిన తెలు గుపై పాలకులకు అభిమానం, ప్రేమ, వాత్సల్యం లేద నుకోలేం.తెలుగుకు ఉన్న ప్రాముఖ్యతను చాటిచెప్పేందు కు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇదంతా తెలుగుభాషపై ఉన్నమక్కువను చాటేందుకు తెలుగును నలుదిశగా వ్యాప్తి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలే. అందులో మరో వాదనకు తావులేదు. కానీ మరొకపక్క తెలుగు రాష్ట్రాల్లోనే క్షేత్రస్థాయిలో ఇంగ్లీషు మోజులో పడి తెలుగుకు తీరని అన్యాయం చేస్తున్నారనే వాదనను కొట్టివేయలేం. తెలుగు భాషకు జరుగుతున్న ద్రోహం, అందువల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందుల గురించి ఆలోచిస్తే ఆవేదన కలుగక తప్పదు. ఇదంతా పరాయి ప్రభువులు చేస్తున్నది కాదు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల ప్రతినిధులమని చెప్పుకుంటున్న నేతలే కావడం విచారకరం. ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారిందనే విషయం వాస్తవం కావొచ్చు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంటే తెలుగు, తెలుగు అంటూ పరిమితులు గీసుకుంటే ఎలాఅని ప్రశ్నిం చేవారు ఉన్నారు. అభివృద్ధివైపు పరుగులు పెట్టొదని చెప్పడం లేదు. కానీ మాతృభాషపై అభిమానం పెంచు కోవడం తప్పుకాదు. అన్యభాషలను ద్వేషించమని అనడం లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మమ్మీ, డాడీ చదువులు ఆరంభమైన తర్వాత తెలుగులో బోధన దాదాపు అదృశ్య మైపోతుందనే చెప్పొచ్చు. తెలుగులో బోధించే ప్రభుత్వ ఎయిడెడ్ విద్యాసంస్థలు దాదాపు మూతపడ్డాయని చెప్పొచ్చు.ఇంగ్లీషులో చదివించడం స్టేటస్ సింబల్గా మారిపో యింది. తెలుగు మాట్లాడేవారిని ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్నచూపు చూడడం పరిపాటి అయిపోయింది.స్వాతం త్య్రం వచ్చినతర్వాత హిందీతో పోటీపడిన తెలుగు దేశం లోనే ప్రత్యేక స్థానమని చెప్పొచ్చు. ఒకప్పుడు రాజ్యాలే లిన భాషలు క్రమేపీ కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుం టున్నాయి. ఐరోపాలో గ్రీక్, లాటిన్, భారత్లో సంస్కృతం తదితర భాషల పరిస్థితి అలాగేఉంది. కానీ ఎన్నోదేశాలు మాతృభాష (mother tongue)లోనే విద్యాబోధన చేసుకుంటున్నాయి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఆంగ్లభాషలోకి భావాలను అను వదించుకుంటూ తల్లిభాషను కాపాడుకుంటున్నాయి. జపాన్, సింగపూర్, కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్ మలే షియా, తదితర దేశాల్లో విద్యాబోధన పాఠశాలస్థాయిలో మాతృభాషలోనే జరుగుతున్నది. టాంజేనియా, జింబాబ్వే, తదితర ఆఫ్రికా దేశాలు పాఠశాల విద్యను మాతృభాష లోనే అందిస్తున్నాయి. ఇకరష్యా, ఫ్రాన్స్, చైనా, తదితర దేశాధ్యక్షులు, నేతలు ఆంగ్లభాషలో సరైనపరిజ్ఞానం ఉన్నా విదేశీ నాయకులతో తమతమ భాషల్లోనే మాట్లాడుతున్నా రు. కానీ తెలుగు రాష్ట్రాల్లో తమ భావాలను స్పష్టంగా తెలుగులో చెప్పగలిగినా ఆంగ్లంలో వ్యక్తం చేసేంత పరి జ్ఞానం లేకపోయినా వచ్చీరాని మాటలతో ప్రయత్నిస్తున్నా రే తప్ప స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడటం నామోషిగా భావించే రోజులు దాపురించాయి. అధికారికంగా వెలువడే ఉత్తర ప్రత్యుత్తరాలు తొంభైశాతం వరకు ఆంగ్లంలోనే ఉంటున్నాయి. అలాని తెలుగుకు ఏమీ చేయడం లేదని చెప్పడం లేదు. ఎన్నోచట్టాలు చేశారు. మరెన్నో నిబంధ నలు విధించారు. కానీ దశాబ్దాలు దాటిపోయినా అవినేటికీ అమలుకు నోచుకోవడం లేదు. అధికార భాషా సంఘాలను ఏర్పాటు చేశారు. ఏదో నామమాత్రపు అధికారాలే తప్ప అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకునే అధికా రాలు నేటి వరకు ఇవ్వలేదు. గతంలో పనిచేసిన అధికార సంఘం అధ్యక్షులు జిల్లాల్లో పర్యటించి ఏమేరకు తెలుగు ను అమలు చేస్తున్నారు? చేయకపోతే ఎందుకుచేయలేదం టూ సమీక్షలు, సమావేశాలుపెట్టి సంబంధిత అధికారులను ప్రశ్నించడమేకాదు లిఖితపూర్వకంగా నోటీసులు ఇచ్చే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంగ్లీషుకు అగ్రపీఠం వేస్తున్నారు. ప్రాథమిక తరగతి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషును ప్రవేశపెడుతున్నారు. జీవిత సారాంశాన్ని వడబోసి రచించిన సుమతి, వేమన, దాశరథి లాంటి శతకాలు కనుమరుగైపోతున్నాయి. క్రమేణ తెలుగు కు ఆదరణ తగ్గిపోతుందని తెలుగుభాషాభిమానులు పడే ఆవేదనను అర్థం చేసుకునేవారే లేకుండాపోయారు. ఇదంతా ఒక ఎత్తైతే ఉభయ రాష్ట్రాల్లో తెలుగు అమలులో జరుగుతున్న నిర్లక్ష్యం వల్ల సామాన్యులకు తీవ్ర ఇబ్బం దులకు గురి చేస్తున్నది. గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ నిర్వహించిన సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. చార్జీషీట్ను పకడ్బందీగా తయారు చేసి దాఖలు చేయకపోవడం వల్ల కేసులు వీగిపోతున్నాయనే విషయం బయటపడింది. ఒక్క పోలీసు శాఖలోనే కాదు మిగిలిన ప్రభుత్వ విభాగాల్లో కూడా ఇంగ్లీషులోనే ఉత్తరప్రత్యుత్తరాలు జరపడం వల్ల సామాన్యులకు అర్థం చేసుకోవడం కష్టమైపోతున్నది. తెలుగుకు పుట్టినిల్లు అయిన తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు భాషకు ద్రోహం జరగడం ఏమాత్రం సమంజసం కాదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News cultural identity language culture latest news mother tongue native language practice vs preaching Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.