ఒంగోలు: మొంథా తుఫాను (Montha Cyclone) కారణంగా ప్రకాశం జిల్లాకు కలిగిన నష్టాన్ని అర్థం చేసుకోగలమని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి బృందం భరోసా ఇచ్చింది. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చింది. వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీ సోమవారం జిల్లాలో పర్యటించింది.
Read Also: Delhi Bomb Blast : ఢిల్లీ పేలుడు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
కేంద్ర బృందం పరిశీలనలు
కేంద్ర బృందంలో పి. పౌసుమి బసు, మహేష్ కుమార్, శశాంక్ శేఖర్ రాయ్, సాయి భగీరథతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఉన్నారు. ఒంగోలుకు చేరుకున్న బృందానికి కలెక్టర్ పి. రాజాబాబు స్వాగతం పలికారు. జిల్లాలో వ్యవసాయం, రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, పంచాయతీరాజ్ రోడ్లు, విద్యుత్, పశుసంవర్ధక శాఖలతో పాటు ఒంగోలు నగరంపై తుఫాను చూపిన తీవ్ర ప్రభావాన్ని కలెక్టర్ వివరించారు. నష్టాన్ని తెలిపే ఫోటో ప్రదర్శన, తుఫానుకు ముందు, తర్వాత పరిస్థితిని వివరించే వీడియోను కేంద్ర బృందం వీక్షించింది.
అనంతరం బృందం అల్లూరు, కొప్పోలు ప్రాంతాల్లోని రొయ్యల చెరువులు మరియు వరి పొలాలను సందర్శించింది. నాగులుప్పలపాడులో దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించింది. వరి దుబ్బులు కుళ్లిపోవడం, పత్తి పంటలకు వేర్లలో ఫంగస్ వ్యాపించడం వలన మరో పంట వేసే అవకాశం కూడా లేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతికి పంట చేతికొచ్చేదని, కానీ పరిస్థితి తారుమారైందని వారు వాపోయారు.
ప్రజాప్రతినిధుల వినతులు
ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ కేంద్ర బృందానికి నష్టం వివరాలు తెలిపారు. అల్లూరు చెరువు కట్టకు గండి పడే ప్రమాదం ఏర్పడినప్పుడు, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తీరును అధికారులు వారికి వివరించారు. ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్,(B.N. Vijay Kumar) రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజా సంఘాల నాయకులు కూడా కేంద్ర బృందాన్ని కలిసి, జిల్లాకు జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: