మొంథా తుపానుతో తూర్పుతీర (Montha) రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాక దీనిపై సమీక్ష నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామని ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు ఒడిశాకు ఎలాంటి ప్రమాదం లేదని, ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఒడిశా ముఖ్యమంత్రి మొహన్ చరణ్ మాంఝ(Mohan Charan Manjha) తెలిపారు. అత్యవసర వైద్యసేవలు సమర్థవంతంగా అందించేందుకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యమంత్రిత్వశాఖ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
Read also: చెన్నైలో ప్రయాణికురాలిపై బైక్ ట్యాక్సీ డ్రైవర్ లైంగిక దాడి
పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు
నిరంతర వర్షాల కారణంగా కొన్నిచోట్ల కొండచరియలు(Montha) విరిగిపడ్డాయని గజపతి జిల్లా కలెక్టర్ మధుమిత తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, కళింగపట్నం మధ్య మొంథా తుపాను తీరం దాటినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 24గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు కూడా బలంగా వీస్తున్నాయి. మత్సకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు చేశారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు ప్రకటిస్తున్నారు. తెలంగాణ పరిధిలో జీహెచ్ఎంసి వారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావద్దని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మూడురోజులు పాఠశాల, కళాశాలలకు సెలవును మంజూరు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: