📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

News Telugu: Montha Cyclone: అంతర్వేది సమీపంలో తీరాన్ని దాటిన మొంథా

Author Icon By Rajitha
Updated: October 29, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Montha Cyclone: గంటకు 90 నుంచి 100 కి.మీ వేగం భారీగా ఆస్తి, పంట నష్టం వణికిన తీరప్రాంత జనం.. లోతట్టు ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలింపు కోనసీమలో మహిళ మృతి విజయవాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ (kakinada) మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీచినట్లు అంచనా తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో తీరప్రాంతంలో 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతర్వేదిపాలెంలో తీరం తాకిన మొంథా తుపాను గడిచిన దాదాపు 12 గంటల్లో గంటకు 17 కి.మీ. వేగంతో కది లిన తుపాను మచిలీపట్నానికి 20 కి.మీ. దూరంలో తుపాను విశాఖకు 220 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమైంది.

Read also: Montha : తుఫాన్ ఎఫెక్ట్ హైదరాబాద్​ నుంచి ఏపీకి వెళ్లే విమానాలు రద్దు

Montha Cyclone

ఈ క్రమంలోనే గాలులు ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు సమీపంలో మొంథా తుపాన్ తీరాన్ని తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం పూర్తిగా తీరాన్ని దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటలు సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ అధికార యంత్రాంగం పేర్కొంది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్లు వేగంతో వీస్తాయని స్పష్టం చేసింది. ఉహించినట్లు మంగళవారం రాత్రి పరిస్థితుల్లో అనుహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు 10 జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తే, ఏడు జిల్లాల్లో పంటనష్టంతో రహదారి వ్యవస్థ దెబ్బతింది. కాకినాడ-మచిలీపట్నం మధ్య మొంథా తుపాన్ తీరాన్ని తాకిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడిం చారు. గడిచిన 12 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో తుపాన్ కదిలిందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 120 కిమీ, కాకినాడకి 110 కిమీ, విశాఖపట్నానికి 220 కిమీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. పూర్తిగా తీరం దాటడానికి 34 గంటల సమయం పడుతోందన్నారు.

Montha Cyclone: దీని ప్రభావంతో కోస్తా వెంబడి గంటకు 90-100 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వివరించారు. ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలన్నారు, కృష్ణా జిల్లాలోని గుడివాడలో తుఫాను ప్రభావంతో భారీ గాలులతో పలుచోట్ల ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలాయి. ప్లై ఓవర్ బ్రిడ్జి, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్, గుడివాడ ముదినేపల్లి ప్రధాన రహదారిలో వృక్షాలు నేలకూలాయి. దీంతో రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచి పోయింది. హుటాహుటిన విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ బృందాలు దాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. చిమ్మ చీకటిలో ఆధునిక యంత్ర సామాగ్రితో రోడ్లపై కూలిన చెట్లను బృందాలు తొలగిస్తున్నాయి. అధికార యంత్రాంగం మొత్తం సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో 222 పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించి వాటిలో అవసరమైన 177 కేంద్రాలను ప్రారంభించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AndhraPradesh antarvedi kakinada latest news MonthaCyclone Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.