📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Montha Cyclone : తెలుగు నేల కకావికలం

Author Icon By Sudha
Updated: October 31, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు నేలపై ప్రకృతి విలయం మూడోకన్ను తెరిచింది. ఐదు రోజులుగా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలకు మొంథా తుపాన్ పెను ముప్పే తెచ్చిపెట్టింది. నర్సాపురంలో తుపానుతీరం దాటాక తెలంగాణ వైపు మళ్లి ఛత్తీస్గఢ్ వైపు వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ పాలకులు గత అనుభవాలతో ప్రాణనష్టం తగ్గించేందుకు చేపట్టిన చర్యలన్నీ సత్ఫలి తాలనిచ్చాయి. కోస్తా జిల్లాలు తుపాను భయంతో మూడు రోజుల పాటు చిగురుటాకులావణికిపోయాయి. ఎన్నడూ లేనట్లుగా భారీ వర్షపాతం నమోదైంది. పంటలన్నీ నీటమునిగి ఇక రైతులు కోలుకునే పరిస్థితి లేదు. సరిగా
పదిరోజుల్లో పంట చేతికొస్తుందని ఆశగా ఎదురుచూసే సమయానికి వారి ఆశలు అడియాసలయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జలఖడ్గం ఇప్పటికీ విసిరి కొడుతోంది. తుపాను (Cyclone) బలపడడం, బలహీనపడటం మధ్య ఎంత అలజడి ఉం టుందో కోస్తా తీరప్రాంత ప్రజలకు తెలియనిదికాదు. అయినా ఈసారి వారిలో గుబులు బయలు దేరింది. ప్రజలెవరినీ ఆ పని మీద ఈ పని మీద అంటూ రోడ్డు పైకి చేరకుండా ప్రభుత్వపాలనా యంత్రాంగం కట్టడి చేయడమొక్కటే ఆంధ్రాలో ప్రాణనష్టం జరుగకుండా ఆపింది. ఉప్పాడతీరం దాదాపు సముద్రంలో కలిసిపో యింది.
సముద్రానికి కట్టిన గోడ కూలిపోయింది. రాళ్లూ లేవు, రప్పలూ లేవు. అన్నీ చెల్లాచెదురైపోయాయి. పెద్ద పెద్ద వటవృక్షాలు కూడా నేలకొరిగాయి. వర్షాలు, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలుగా అంచనా వేసుకొని ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకున్నాఆస్తినష్టాన్ని, పంటల నష్టాన్నీ ఆపలేకపోయింది. దాదాపుగా తీరాన్ని తుడిచి పెట్టేసింది. 14 జిల్లాల్లో తుపాను (Cyclone) ప్రభావం తీవ్రంగా ఉంది. చెప్పాలంటే ఈ తుపాను తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్ మోగించింది. కోనసీమలో కొబ్బరి చెట్లు, తీరానికి దగ్గరలో ఉన్న అన్నిరకాల వృక్షా లు
విరిగి నేలకొరిగాయి. తుపాను సమయంలో రోడ్ల మీద జనం లేకుండా చూడటం వలన ప్రాణనష్టం గణ నీయంగా తగ్గినట్లే. తీవ్రమైన ఈదురుగాలులకే తొలి నష్టాలు నమోదయ్యాయి. విమానాలు సైతం వాతావ రణం అనుకూలించక రద్దుచేశారు. రోడ్ల మీద జనసంచారం లేకుండా వాణిజ్య సంస్థలను కూడా మూసివేయిం చారు. ప్రకాశం బ్యారేజి ఉధృతంగా ప్రవహిస్తోంటే లక్ష క్యూసెక్కుల నీటిని బయటకు వదిలింది. ఆంధ్రాలో 249 మండలాలు 48 మునిసి పాలిటీలు తీవ్రస్థాయిలో తడిసి ముద్దవగా 18 లక్షల మంది ప్రజలపై ప్రభావం పడింది. ముందుగా ప్రచండగాలులు వీచి మొంథాతుపాను ఆంధ్రా నుంచి తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ చేరుకోగా ఆరాష్ట్రం లో కూడా తీవ్ర నష్టాన్నిమిగిల్చే అవకాశం కనపడుతోం ది. నందిగామ వద్ద మున్నేరు వాగు పొంగుతోంది. తుపాన్ల సమయంలో జారీ చేయాల్సిన అన్ని రకాల జగ్రత్తలు తీసుకున్నారు. అనంతర సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికనే జరుగుతున్నాయి. తెలంగాణలో భీమ దేవరపల్లిలో 41. 2అత్యధిక వరపాతం నమోదైంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫ్లాషడ్ హెచ్చరికలు ముందస్తుగానే వాతావరణ శాఖ అందించడంతో ఇక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పోర్టుల తెలుగు రాష్ట్రా ల్లో ప్రధానంగా రాకపోకలు స్తంభించాయి. తుపాను ప్రభా వితం ప్రాంతాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకునేందుకు వీలుగా రైళ్లు, బస్సులు నిలిపివేయడంతో జనం ఇంటికే పరిమితమయ్యారు. ఆంధ్రా మీదుగా వెళ్లే దాదాపు 137 రైళ్లను రద్దు చేశారు. తెలంగాణలో కొన్ని రైళ్లుభారీ వర్షా ల్లో చిక్కుకుని డోర్నకల్ రైల్వే జంక్షన్లో ఆగిపోయాయి. ఈ స్టేషన్లోనీళ్లు భారీఎత్తున నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మంవాగులు, వంకలు ఉప్పొంగాయి. మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబికుమంటూ కాలం గడిపారు. హైదరాబాద్ జంటనగరాల్లో కూడా భారీ వర్షా లు కురిసి జనజీవనం లేకుండా చేశాయి. విద్యుత్ స్తం భాలునేలకొరిగాయి. తుపాను మోత మోగించిన తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ముందస్తు విద్యుత్ సరఫరా నిలి పివేసి ప్రాణాపాయంలేకుండా జగ్రత్తపడ్డారు. ఈమొంథా ప్రభావం తమిళనాడును కూడా వదల్లేదు. భారీ వర్షాలతో ముంచెత్తింది. తెలంగాణలో ప్రధాన పట్టణాలన్నీ 2,3అడుగులు నీటిలో నిండిపోయాయి. రోడ్ల మధ్య గట్లుతెగి పోయాయి. చాలా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయా యి. విజయవాడ నుంచిహైదరాబాద్ జాతీయ రహదా రిలో వాహనాలు ప్రయాణించే సౌలభ్యం, సౌకర్యంసరిగ్గా లేదు. కోస్తాతీరాన్ని తుడిచిపెట్టేసినా మొంథా ఇంకా శాంతించి నట్లు లేదు. మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సహాయక చర్యలకు అవరోధాలున్నాయి. ప్రకాశం బ్యారేజి వరద కట్టలు కాపాడుతున్నాఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరద పెరుగుతుందనే అంచనాలున్నాయి. బ్యారేజ్ దిగు వనున్న లంక గ్రామాలు ఇంకా జాగ్రత్తలు తీసుకోదగిన పరిస్థితిలోనే ఉన్నాయి. నెమ్మది నెమ్మది పునరా వాస కేంద్రాల నుంచి జనం ఇంటికి చేరేవరకు వారికోసం ప్రభుత్వమే ఏర్పాట్లుముమ్మరంగా చేయడంవలన కాస్తం త వారు కుదుటపడ్డారు. కాగా వారి జీవనోపాధి లేకుండా పోయింది. బాధిత ప్రజలంతా ప్రభుత్వసహాయం కోసం ఎదురు చూస్తు న్నారు. అనేక ప్రాంతాల్లో కొట్టుకుపోయిన రహదార్లు, రైల్వేట్రాకుల పునరుద్ధరణకు కార్యచరణ మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983, 1986, 1996లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలకన్నా ఈసారి మొంథాలో ఎక్కువ ఆస్తి, వ్యవసాయం పెట్టుబడులు నష్టం అధికంగా ఉంటుందని అంచనా మధ్య రైతాంగం కుదేలవుతోంది. నష్టాల అంచనాలో లోపాలు లేకుండా జరిపి ప్రభావిత ప్రజల్ని ఆదుకోవడమే ఒక్కటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh Breaking News cyclone latest news montha cyclone Telangana Telugu News weather

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.