మంత్రి లోకేష్ విజయవాడ : మొంథా తుపాను వల్ల రాష్ట్రంలో సుమారు 40లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అత్యధిక తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించామన్నారు. ఆ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలు రెడ్ అలర్ట్లో ఉన్నాయి. ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఒక్కటే, ఎటువంటి ప్రాణ నష్టంఉండకూడదు, ముఖ్యమంత్రి ఆదేశాలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హోంమంత్రి అనితతో కలిసి మంగళవారం సాయంత్రం మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ తుపాను సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఒకపక్క డిజాస్టర్ మేనేజర్మెంట్ మంత్రి అనిత (Vangalapudi Anitha) మరోవైపు ఆర్టీజీ ఎస్ మంత్రిగా నేను సమన్వయంతో గత 24గంటలుగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. అమలాపురం సమీపంలో తుపాను తీరం దాటబో తోంది. ఈ సందర్భంగా 90 నుంచి 100కి.మీల వేగంతో అక్కడ ఈదురు గాలులు వీచే అవకాశం పరిసర ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Read also: Montha Cyclone: అంతర్వేది సమీపంలో తీరాన్ని దాటిన మొంథా

Montha Cyclone
1906 తాత్కాలిక షెల్టర్ల ఏర్పాటు.: ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు (N. Chandrababu Naidu) ఈ నెల 23వ తేదీ నుంచి నేరుగా పర్యవేక్షిస్తున్నారు. యుఏఈకి వెళ్లే ముందు, అక్కడ నుంచి వచ్చిన తర్వాత 12 రివ్యూ మీటింగ్లు, టెలీ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుపాను పరిస్థితులపై సమీక్ష చేశారు. ప్రధాని నరేంద్రమోడీ సీఎంతో మాట్లాడి ముందస్తు ఏర్పాట్లపై వాకబు చేశారు. తుపాను ప్రభావం, ముంపు తీవ్రత అధికంగా ఉండే 1,328 గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. 3,465 గర్భిణీలను తరలించి, వారికి కావాల్సిన పౌష్టికాహారం, నిత్యావసరాలను అందజేస్తున్నాం. 1,906 తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటుచేసి పునరావాసానికి అవసరమైన సామగ్రి అంతా పంపించామన్నారు.
ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
14,798 పాఠశాలలకు సెలవులు ప్రకటించాం, 364 స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చాం. ఈ నెల 29వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసి, నిషేదాజులు విధించాం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం 11 ఎన్ డీఆర్ఎఫ్, 12 ఎస్ డీఆర్ ఎఫ్ టీమ్ లు, రిజర్వ్ టీమ్ లు కూడా సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే రావడానికి ఆర్మీ కూడా హైదరాబాద్ లో సిద్ధంగా ఉన్నారు. 145 ఉడ్ కటింగ్ టీమ్స్ సిద్ధంగా ఉన్నారు, ఇప్పటికే విశాఖపట్నం, తదితర ప్రాంతాల్లో చెట్లు పడిపోయిన చోట వారు సేవలందిస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్ కు సంబంధించి 325 శిబిరాలు సిద్ధం చేశాం, 876 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి.
మొంథా తుపాను వల్ల ఎన్ని జిల్లాలు ప్రభావితమయ్యాయి?
మొత్తం ఏడు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది?
పునరావాస కేంద్రాలు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: